USA India : డాలర్లను ప్రేమించే వాళ్లకు, ప్రధానంగా అమెరికా జపం చేసే వాళ్లకు తీపి కబురు చెప్పింది ఆ దేశం. కరోనా కారణంగా గత రెండు ఏళ్లుగా కఠినమైన ఆంక్షలు విధించింది.
విధిగా వ్యాక్సినేషన్ వేసు కోవాలని, బయో బబుల్ లో ఉండాలని, అవసరమైతే బూస్టర్ డోస్ కూడా వేసు కోవాలని యుఎస్ సర్కార్ స్పష్టం చేసింది. తాజాగా అమెరికా వెళ్లే భారతీయులు, ఎన్నారైలకు గుడ్ న్యూస్ (USA India )చెప్పింది.
సవాలక్ష రూల్స్ ను సడలిస్తున్నట్లు ప్రకటించింది. కోవిడ్ -19 (Covid-19) ప్రయాణ సిఫారసును లెవల్ 3 హై నుంచి లెవల్ 1 తక్కువకి మార్చినట్లు ప్రకటించింది. అమెరికా ఆయా దేశాలకు సంబంధించి రేటింగ్ ఇస్తుంది.
తాజాగా భారత దేశానికి సంబంధించి కోవిడ్ (Covid) ట్రావెల్ రేటింగ్ ను మరింత సులభతరం చేసింది. టీకాలు వేయించు కోని వారు కూడా వేయించు కోవాలని సూచించింది.
అయితే ప్రమాణం చేయాలంటే తప్పనిసరి చేసిన మార్గదర్శకాలలో సడలింపు ఇవ్వడం విశేషం. దీని వల్ల జర్నీ చేయడం ఇబ్బంది అంటూ ఉండదు.
యుఎస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (US Centers for Disease Control and Prevention) – సీడీసి, స్టేట్ డిపార్ట్ మెంట్ ఇండియాతో పాటు మరికొన్ని దేశాలకు కోవిడ్ -19 (Covid-19) ట్రావెల్ రేటింగ్ లను సడలించింది.
ఇందులో భాగంగా లెవల్ 3 హై నుంచి లెవల్ 1 తక్కువకు మార్చినట్లు తెలిపింది. దీంతో పాటు వ్యాక్సినేషన్ తీసుకోని వాళ్లను నివారించమని కోరింది.
కరోనా ప్రస్తుతం తగ్గుముఖం పట్టినా ప్రతి ఒక్కరు వ్యాక్సిన్ వేసుకోవాలని సూచించింది. తీవ్ర ఇబ్బందులు పడిన వాళ్లకు ఇది గుడ్ న్యూస్(USA India )అని చెప్పక తప్పదు.
Also Read : యుఎస్ ఎన్ఎస్సీ సభ్యుడిగా రో ఖన్నా