Nikki Haley : అమెరికా ఏటీఎం లాగా మారింది – హేలీ
ప్రవాస భారతీయురాలి షాకింగ్ కామెంట్స్
Nikki Haley : ఇప్పటికే అమెరికా అన్ని రంగాలలో అత్యంత బలహీనంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు అధ్యక్ష బరిలో ఉన్న ప్రవాస భారతీయురాలైన నిక్కీ హేలీ. ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశానికి సంబంధించి నిర్దిష్టమైన విధానం లేకుండా పోయిందన్నారు. బలహీనమైన పరిస్థితుల్లో ఉన్న దేశం ఇతర దేశాలకు సాయం చేయడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు. దేశం చేసిన సాయం ఏ ఒక్కరికీ ఉపయోగ పడడం లేదన్నారు నిక్కీ హేలీ(Nikki Haley USA).
ప్రతి దేశానికి అమెరికా ఇప్పుడు ఏటీఎం లాగా మారి పోయిందంటూ ఎద్దేవా చేశారు. గత ఏడాది అమెరికా విదేశీ సాయం కోసం 46 బిలియన్ డాలర్లు ఖర్చు చేసిందన్నారు. ఇది చైనా, పాకిస్తాన్ , ఇరాక్ వంటి దేశాలకు అందించిందని ఆరోపించారు. ఇది ఎంత మాత్రం మంచి పద్దతి కాదన్నారు.
ఎందుకంటే ఈ మూడు దేశాలు అత్యంత ప్రమాదకరమైనవని హెచ్చరించారు. ప్రమాదమని తెలిసినా ఎందుకు చెల్లించాలంటూ ప్రశ్నించారు నిక్కీ హేలీ, ఒక రకంగా అన్ని దేశాలు ఇప్పుడు అమెరికాను ఒక ఏటీఎం (ఎనీ టైమ్ మెషీన్ ) గా భావిస్తున్నాయని ఎద్దేవా చేశారు.
ఆమె గతంలో ఐక్య రాజ్య సమితి రాయబారిగా కూడా పని చేశారు. ఆమె ఇటీవలే తాను కూడా అమెరికా అధ్యక్ష పదవికి పోటీ పడుతున్నానని ప్రకటించారు. ఇప్పటి వరకు డొనాల్డ్ ట్రంప్ మాత్రమే పేరు వినిపించేది. ప్రస్తుతం నిక్కీ హేలీ(Nikki Haley USA) కూడా బరిలో నిలుస్తానని ప్రకటించారు. ఆమె గత నెల నుంచే తన ప్రచారాన్ని ముమ్మరం చేశారు.
Also Read : భారీగా తగ్గిన ఉగ్రవాద దాడులు