US Visa : డాలర్లు సంపాదించాలని కలలు కనే వాళ్లకు ప్రధానంగా డాలర్ డ్రీమర్స్ కు తీపి కబురు చెప్పింది అమెరికా. మరి డాలర్లు సంపాదించాలంటే వీసా తప్పనిసరిగా ఉండాల్సిందే.
లేక పోతే అమెరికా వెళ్లలేం. తాజాగా అమెరికా ప్రభుత్వం విద్యార్థులు, కార్మికులతో సహా వేలాది మంది వీసా దరఖాస్తులందరికీ నిర్వహించే ఇంటర్వ్యూలను రద్దు చేసినట్లు ప్రకటించింది.
ఈ ఏడాది 31 వరకు విద్యార్థులు, కార్మికులు, సాంస్కృక కళాకారలుకు ప్రతి ఏటా వివిధ రకాల వీసాలను(US Visa) జారీ చేస్తుంది. ఈసారి వాటికి సంబంధించిన ఇంటర్యూలను రద్దు చేస్తున్నట్లు వెల్లడించారు.
ఇప్పటి దాకా విద్యార్థులకు ఎఫ్, ఎం, జే వీసాలను జారీ చేస్తుండగా ఉద్యోగులకు హెచ్ -1, హెచ్ -2 , హెచ్ -3, ఎల్ వీసాలను(US Visa) జారీ చేస్తుంది.
సాంస్కృతిక కళాకారులు, విశిష్ట ప్రతిభావంతులకు ఓ, పీ, క్యూ లకు గాను వ్యక్తిగత ఇంటర్యూలు రద్దుకు అర్హులంటూ పేర్కొంది. ఈ నిర్ణయం వల్ల వీసా దరఖాస్తుదారులకు, వారి కుటుంబీకులకు, స్నేహితులకు ఉప యుక్తంగా ఉండటే కాక అడ్డంకులను తొలగిస్తుంది.
ఈ విషయాన్ని అమెరికా చీఫ్ జోసెఫ్ బైడెన్ కు సలహాదారుడిగా ఉన్న భూటోరియా స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా దక్షిణాసియా సహాయ కార్యదర్శి డోనాల్ తో చర్చంచారు. ఆ తర్వాత కీలక నిర్ణయం తీసుకున్నారు.
ఈ ఒక్క నిర్ణయం వల్ల వేలాది మందికి మేలు చేకూర్చనుంది. ఇదిలా ఉండగా యూఎస్ ఎంబసీ తో పాటు హైదరాబాద్, చెనన్ఐ, కోల్ కతా, ముంబై లోని కాన్సులేట్ లు సరికొత్త దరఖాస్తులను ఆహ్వానించింది
Also Read : బైడెన్ నిర్వాకం రష్యా యుద్ధం