Amit Shah : మాకే అధికారం మాదే రాజ్యం

స్ప‌ష్టం చేసిన అమిత్ చంద్ర షా

Amit Shah : కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ చంద్ర షా కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. క‌ర్ణాట‌క‌లో నువ్వా నేనా అన్న రీతిలో ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఎగ్జిట్ పోల్స్ హంగ్ కు ఛాన్స్ ఉందంటూ పేర్కొన్నాయి. ఇక ఇప్ప‌టికే అధికారంలో ఉన్న భార‌తీయ జ‌న‌తా పార్టీ ప్ర‌భుత్వం మరోసారి ప‌వ‌ర్ లోకి రావాల‌ని తెగ ముచ్చ‌ట ప‌డుతోంది. ఆ మేర‌కు ట్ర‌బుల్ షూట‌ర్ గా పేరు పొందిన అమిత్ షా(Amit Shah) గెలిపించే బాధ్య‌త‌ను త‌న భుజాన వేసుకున్నారు. అన్నీ తానై న‌డిపిస్తున్నారు.

ఇక బీజేపీ అంటేనే మోదీగా మారి పోయిన ప్ర‌స్తుత త‌రుణంలో ప్ర‌ధాన‌మంత్రిని ముందు పెట్టి ప్ర‌చార అస్త్రంగా బీజేపీ ముందుకు వెళుతోంది. ఈ త‌రుణంలో మే 10న పోలింగ్ జ‌ర‌గ‌నుండ‌గా 13న ఫ‌లితాలు వ‌స్తాయి. ప్ర‌స్తుతం బీజేపీ వ‌ర్సెస్ కాంగ్రెస్ గా మారి పోయింది. ఇరు పార్టీలు మాట‌ల యుద్దానికి తెర లేపాయి.

ఈ సంద‌ర్భంగా ఎన్నిక‌ల‌ను పుర‌స్క‌రించుకుని అమిత్ షా నిప్పులు చెరిగారు. గ‌త పాల‌కులు క‌ర్ణాట‌క‌కు ఏం చేశారంటూ ప్ర‌శ్నించారు. తాము గ‌తంలో ఎన్న‌డూ లేని రీతిలో దేశంలో ఏ రాష్ట్రానికి ఇవ్వ‌నన్ని నిధుల‌ను మంజూరు చేశామ‌ని స్ప‌ష్టం చేశారు అమిత్ షా(Amit Shah).

ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా అంకెల్ లో భారీ రోడ్ షో చేప‌ట్టారు. షా ముఖ్య అతిథిగా పాల్గొని ప్ర‌సంగించారు. కాంగ్రెస్ పార్టీకి అంత సీన్ లేద‌ని , ప్ర‌జ‌ల‌కు త‌మ‌కే అధికారం క‌ట్ట‌బెట్ట‌డం ఖాయ‌మ‌న్నారు. ఇక క‌న్న‌డ రాజ్యాం కాషాయానిదేన‌ని స్ప‌ష్టం చేశారు షా.

Also Read : ది కేర‌ళ స్టోరీని ప్ర‌తి ఒక్క‌రు చూడాలి

Leave A Reply

Your Email Id will not be published!