Amit Shah: పార్టీ అధ్యక్షుల ఎంపికపై అఖిలేశ్ కు అమిత్‌షా స్ట్రాంగ్ రిప్లయ్
పార్టీ అధ్యక్షుల ఎంపికపై అఖిలేశ్ కు అమిత్‌షా స్ట్రాంగ్ రిప్లయ్
Amit Shah : వక్ఫ్ (సవరణ) బిల్లుపై బుధవారం లోక్‌సభలో చర్చ సందర్భంగా సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్, కేంద్ర హోం మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా(Amit Shah) పరస్పరం వ్యంగ్యాస్త్రాలు సంధించుకున్నారు. వక్ఫ్ (సవరణ) బిల్లు-2025 పై తొలుత అఖిలేశ్ యాదవ్ మాట్లాడుతూ… ‘ప్రపంచంలో అతిపెద్ద పార్టీ తన అధ్యక్షుడిని ఎన్నుకోలేకపోతోందని బీజేపీను ఉద్దేశించి ఘాటైన వ్యాఖ్యలు చేసారు. పార్టీ అధ్యక్షుడ్ని ఎంపిక చేసుకోలేని బీజేపీ… వక్ఫ్ బిల్లు ద్వారా ముస్లిం ఆస్తులను పరిరక్షించడం సాధ్యమేనా అంటూ అఖిలేశ్ ఎద్దేవా చేసారు.
Amit Shah Slams
అఖిలేశ్ వ్యాఖ్యలపై బీజేపీ అగ్రనేత, కేంద్ర హోం మంత్రి అమిత్ షా తనదైన శైలిలో వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ‘‘అఖిలేశ్ జీ నవ్వుతూ ఓ విషయం వెల్లడించారు. నేను కూడా నవ్వుతూనే సమాధానం ఇస్తాను. కొన్ని పార్టీల నాయకత్వం ఓ కుటుంబం లేదా ఓ ఐదుగురు చేతుల్లోనే ఉంటుంది. దీనితో ఆ కొద్ది మంది నుంచే అధ్యక్షుడిని నియమించుకుంటారు. కానీ, పెద్ద పార్టీ అయిన బీజేపీ ఒక ప్రక్రియను పాటించాల్సి ఉంటుంది. సుమారు 13 కోట్ల మంది పార్టీ సభ్యుల నుంచి ఒకరిని ఎంపిక చేసుకోవాలి. అందువల్ల సమయం పడుతుంది. పార్టీ అధ్యక్షుడి ఎంపికకు మీ సమాజ్‌వాదీ పార్టీకి టైం పట్టదు… ఎందుకంటే మరో 25 ఏళ్లు మీరే పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతారు. అందులో మార్పేమీ ఉండదు అంటూ అమిత్ షా దీటుగా బదులిచ్చారు. దీనితో లోక్ సభ ఒక్కసారిగా చప్పట్లతో దద్దరిల్లింది.
Also Read : Waqf Bill: చారిత్రాత్మక వక్ఫ్ (సవరణ) బిల్లు-2025 కు లోక్‌సభ ఆమోదం