Amit Shah: హైదరాబాద్ లో గణేశ్ నిమజ్జనానికి కేంద్ర హోం మంత్రి అమిత్ షా
హైదరాబాద్ లో గణేశ్ నిమజ్జనానికి కేంద్ర హోం మంత్రి అమిత్ షా
Amit Shah : గణేశ్ నిమజ్జనంలో పాల్గొనేందుకు ఈ నెల 6న కేంద్ర హోంశాఖమంత్రి అమిత్ షా (Amit Shah) హైదరాబాద్‌కు రానున్నారు. మధ్యాహ్నం 1:10కి ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా ఐటీసీ కాకతీయకు చేరుకుంటారు. భోజన విరామం అనంతరం మధ్యాహ్నాం 2 నుంచి 3 గంటల వరకు బీజేపీ ముఖ్య నేతలతో భేటీకానున్నారు. రాష్ర్టంలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులు, పార్టీ బలోపేతం, స్థానిక సంస్థల ఎన్నికల సమాయత్తంపై ఆరా తీయనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
మధ్యాహ్నం 3 నుంచి 3:30 వరకు భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి 46 ఏళ్ల ప్రయాణంపై ఐటీసీ కాకతీయలో ఏర్పాటు చేసే ఫోటో ఎగ్జిబిషన్‌ను కేంద్ర హోంమంత్రి (Amit Shah) ప్రారంభించి.. కమిటీ సభ్యులతో గ్రూప్ ఫోటో దిగనున్నారు. 3:30 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎస్‌ఎస్‌బీ 28వ బెటాలియన్ హెడ్‌క్వార్టర్స్‌కి వర్చువల్‌గా శంకుస్థాపన చేస్తారు. ఐటీసీ కాకతీయ నుంచి సాయంత్రం 4 గంటలకు మెజాంజాహీ మార్కెట్ వినాయక చౌక్‌కు చేరుకుని గణనాథులకు స్వాగతం పలకడంతో పాటు గణేష్ శోభాయాత్రను ఉద్దేశించి ప్రసంగిస్తారని బీజేపీ వర్గాలు తెలిపాయి.
Amit Shah – నేటితో ముగియనున్న ఖైరతాబాద్ మహాగణపతి దర్శనం
ఖైరతాబాద్ మహాగణపతి వద్ద భక్తుల రద్దీ భారీగా పెరిగింది. 8వ రోజు విశ్వరూప మహాగణపతి దర్శనానికి 3 గంటల సమయం పడుతోంది. భక్తులతో క్యూలైన్లు కిటకిటలాడుతున్నాయి. దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి బడా గణేష్‌ను దర్శించుకోవడానికి భక్తులు తరలివస్తున్నారు. దీంతో లక్డీకాపూల్, ట్యాంక్‌బండ్, సచివాలయం మార్గాల్లో ట్రాఫిక్ జామ్ అయింది. వారం రోజుల్లో దాదాపు 12 లక్షల మందికి పైగా భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు.
నేటితో మహాగణపతి దర్శనం ముగియనుండటంతో భక్తుల రద్దీ మరింత పెరిగే అవకాశముందని భావిస్తున్నారు. మండపం తొలగింపు పనులు త్వరితగతిన పూర్తి చేయడం కోసం రేపటి నుంచి దర్శనాలు నిలిపివేస్తున్నట్టు ఉత్సవ కమిటీ నిర్వాహకులు తెలిపారు. శుక్రవారం తెల్లవారుజాము నుంచి శోభాయాత్రపనులు ప్రారంభం కానున్నాయి. గురువారం ఒక్కరోజే దర్శనానికి అవకాశం ఉన్నందున భక్తులు లక్షలాదిగా తరలివస్తారని పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్టు సమాచారం.
Also Read : CM Revanth Reddy: మీ కుటుంబ పంచాయితీలోనికి మమ్మల్ని లాగొద్దు – సీఎం రేవంత్‌రెడ్డి
