Paresh Rawal : అమితాబ్ బచ్చన్ లివింగ్ లెజెండ్ – రావల్
రుణదాతలందరికీ తీర్చిన ఘనత ఆయనది
Paresh Rawal : అమితాబ్ బచ్చన్ గురించి ఈ దేశంలో తెలియని వారంటూ ఉండరు. ప్రపంచ సినీ రంగంలో తనకంటూ ఓ ప్లేస్ ను ఏర్పర్చుకున్న అరుదైన నటుడు. ఒక రకంగా చెప్పాలంటే ఆయన తన లైఫ్ జర్నీలో ఎత్తు పల్లాలను చవిచూశాడు. ఒకానొక దశలో ఆస్తులన్నీ తాకట్టు పెట్టాడు.
ఆత్మహత్యకు చేసుకోవాలన్నంత డిప్రెషన్ లోకి వెళ్లి పోయాడు. కానీ ఎక్కడైతే తాను పోగొట్టుకున్నాడో అక్కడి నుంచే మళ్లీ తన ప్రయాణాన్ని ప్రారంభించాడు. తాను కష్టంలో ఉన్నప్పుడు, లేదా తాను అప్పులు చేసిన వారందరికీ పేరు పేరునా వడ్డీతో సహా తిరిగి చెల్లించాడు.
ఆయన వయస్సు పెరిగినా ఇంకా బాలీవుడ్ లో నటిస్తూనే ఉన్నాడు. ఇటీవల చిరంజీవితో కలిసి సురేందర్ రెడ్డి దర్శకత్వంలో సైరా నరసింహారెడ్డితో కలిసి నటించారు అమితాబ్ బచ్చన్. ఆయన నిర్వహించే ఫేమస్ షో కౌన్ బనేగా కరోడ్ పతి మోస్ట్ పాపులర్ షోగా ఇప్పటికీ టాప్ లో కొనసాగుతోంది.
తాజాగా ఓ ఛానల్ తో మాట్లాడారు ప్రముఖ నటుడు పర్వేష్ రావాల్(Paresh Rawal). అమితాబ్ బచ్చన్ నుంచి ఎంతో నేర్చుకోవాల్సింది ఉందన్నారు. ఆయన ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండే మనస్తత్వం తనకు చాలా ఇష్టమని చెప్పారు రావల్. ఈ సందర్భంగా తన రుణదాతలందరికీ రూ. 900 కోట్లు తిరిగి చెల్లించడం మామూలు విషయం కాదన్నారు.
ఏది ఏమైనా అత్యున్నత స్థానంలో ఉన్నా అత్యంత కింది స్థాయికి చేరుకున్నా ఎప్పటి లాగే అమితాబ్ బచ్చన్ ఉన్నారంటూ పర్వేష్ రావల్ కితాబు ఇచ్చారు. ప్రస్తుతం పర్వేష్ రావల్ చేసిన కామెంట్స్ నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.
Also Read : రాహుల్ యాత్రలో ‘స్వర భాస్కర్’