Grandhi Anil : టాప్ సీఇఓలలో గ్రంధి అనిల్
40 ఏళ్ల వయస్సులో అరుదైన ఘనత
Grandhi Anil : భారతీయ సంతతికి చెందిన ముఖ్య కార్యనిర్వాహణ అధికారి (సిఇఓ) లలో అత్యుత్తమైన సిఇఓగా ఎంపికయ్యాడు గ్రంధి అనిల్. కేవలం అతడి వయస్సు కేవలం 40 ఏళ్లు కావడం విశేషం.
అద్భుతమైన నిర్వహణ సామర్థ్యం కలిగి ఉన్నాడు. అనిల్ గ్రంథి(Grandhi Anil) ఏజీ ఫిన్ టాక్స్ ఫౌండర్ కూడా. సిఇఓ పబ్లికేషన్స్ ఈ ఏడాదికి సంబంధించి ప్రకటించిన టాప్ సిఇఓలలో గ్రంథి అనిల్ నిలిచాడు.
వృత్తి పరమైన సిపీఏలు, చార్టెర్డ్ అకౌంటెంట్లు , సిఎంఏల బృందం వ్యాపారాలు తమ నగదు ప్రవాహాలను పెంచుకుంటూనే గణనీయమైన మొత్తంలో డబ్బును ఆదా చేయడంలో సహాయ పడేందుకు పన్ను ప్రణాళికలో ఒక వినూత్న విధానాన్ని రూపొందించారు.
నాకంటూ కలలు ఉన్నాయి. సాకారం చేసుకునేందుకు తనను ప్రోత్సహించిన జట్టు సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలియ చేస్తున్నట్లు తెలిపారు గ్రంధి అనిల్. నిజమైన ఫౌండర్ , మరో వ్యవస్థాపకుడిని గుర్తించగలడన్నారు.
పన్ను ప్రణాళిక, సిఎఫ్ఓ సేవలు, సంపద నిర్వహణ, ఆర్థిక దృక్పథాలపై వ్యాపారవేత్తలు, చిన్న వ్యాపారాలకు అనిల్ గ్రాంథి నైపుణ్యం, మార్గదర్శకత్వం గమనించదగ్గదన్నారు.
ఈ ఏడాది 2022 టాప్ 20 డైనమిక్ సిఇఓలలో ఒకరిగా గుర్తింప బడ్డాడు. ఈ సందర్బంగా ఎంపిక చేసిన అనిల్ గ్రంథి(Grandhi Anil) అద్భుతమైన సిఇఓ నైపుణ్యాలను కలిగి ఉన్నాడని సిఇఓ పబ్లికేషన్ మేనేజింగ్ ఎడిటర్ ఆడమ్ పాట్రిక్ స్పష్టం చేశారు.
ఇదిలా ఉండగా గ్రంథి అనిల్ ఏపీలోని శ్రీకాకుళం జిల్లాలోని రాజాం పట్టణానికి చెందిన వ్యక్తి. సీఏ చదివాడు. హైదరాబాద్ లోని పీడబ్ల్యూసీలో పేరొందాడు.
ఈ సందర్భంగా అనిల్ గ్రాంధిని జిఎంఆర్ గ్రూప్ చైర్మన్ శ్రీ గ్రంథి మల్లికార్జున రావు అభినందించారు.
Also Read : మరోసారి డీలా పడిన రూపాయి