Anam Ramanaraya Reddy: కృష్ణా, గోదావరి సంగమం దగ్గర జలహారతులు పునరుద్ధరిస్తాం – మంత్రి ఆనం
కృష్ణా, గోదావరి సంగమం దగ్గర జలహారతులు పునరుద్ధరిస్తాం - మంత్రి ఆనం
Anam Ramanaraya Reddy: కృష్ణా, గోదావరి సంగమం దగ్గర జలహారతులు పునరుద్ధరిస్తామని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. జలహారతులపై మంత్రుల కమిటీ ఆదివారం నాడు భేటీ అయింది. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో గోదావరి, కృష్ణా సంగమం వద్ద ప్రతీ రోజూ హారతి కార్యక్రమం నిర్వహించేవారు. అయితే వైసీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత కొన్ని రోజులు ఆ కార్యక్రమం కొనసాగించినప్పటికీ… కోవిడ్ లాక్ డౌన్ వలన హారతి కార్యక్రమాలను నిలిపివేసారు. అయితే కోవిడ్ నిబంధనలు తొలగించిన తరువాత మరల హారతి కార్యక్రమాన్ని పునరుద్ధరించలేదు. ఈ నేపథ్యంలో కొత్తగా మళ్ళీ అధికారంలోనికి వచ్చిన టీడీపీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వంలో దేవదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి గా ఉన్న ఆనం రామనారాయణ రెడ్డి(Anam Ramanaraya Reddy) జలహారతులు పునరుద్ధరిస్తామని స్పష్టం చేసారు. దేవస్థానాలకు త్వరలో కొత్త పాలకమండళ్లు నియమిస్తామని ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. CGF కింద 160 ఆలయాలు పున:నిర్మిస్తామని ఆనం రామనారాయణరెడ్డి ప్రకటించారు.
Anam Ramanaraya Reddy Comment
ఆలయ భూములు పరిశీలించి ఆక్రమణలు తొలగిస్తామని చెప్పారు. రూ. 50వేల కంటే తక్కువ ఆదాయం ఉన్న ఆలయాలకు ఆర్థిక సాయం పెంచుతున్నట్లు ప్రకటించారు. తిరుమల నుంచే దేవాదాయ శాఖలో ప్రక్షాళన చేస్తామని స్పష్టం చేశారు. ఏ చిన్న ఆరోపణలు వచ్చినా నివేదికలు తెప్పించుకుంటున్నామని అన్నారు. నెల్లూరు జిల్లాలో ఐదుగురు దేవాదాయ శాఖ అధికారులపై చర్యలు తీసుకుంటున్నామని హెచ్చరించారు. మరో వివాదాస్పద అధికారిపై విచారణ చేపడతామని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి పేర్కొన్నారు.
Also Read : Minister Ram Mohan Naidu : తెలుగు రాష్ట్రాల్లో కొత్త ఏయిర్పోర్టులపై కీలక అంశాలు