#AnandDevarakonda : బడా నిర్మాతతో సినిమా చేయబోతున్న ఆనంద్ దేవరకొండ

ఆనంద్ దేవరకొండ దొరసాని సినిమాతో తెలుగు తెరకు పరిచయమయ్యాడు.

AnandDevarakonda : టాలీవుడ్ లో ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా కష్టపడి ఎదిగిన హీరోల్లో విజయ్ దేవరకొండ ఒకరు. ఈయన ప్రస్తుతం పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో లైగర్ సినిమాలో నటిస్తున్నాడు. విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ కూడా డిఫరెంట్ కథలతో మెల్ల మెల్లగా సినిమాలు చేస్తూ తన రేంజ్ ను పెంచుకుంటున్నాడు. ఆనంద్ దేవరకొండ దొరసాని సినిమాతో తెలుగు తెరకు పరిచయమయ్యాడు.

దొరసాని సినిమాతో మంచి నటుడుగా గుర్తింపు తెచ్చుకున్నాడు. తన రెండవ సినిమా ‘మిడిల్ క్లాస్ మెలోడీస్’ కరోనా కారణంగా ఓటిటిలో రిలీజ్ అయ్యి మంచి విజయాన్ని సాధించింది. గుంటూరు బ్యాక్ డ్రాప్ లో వచ్చిన మిడిల్ క్లాస్ మెలోడీస్ సినిమా ఫ్యామిలీ ఆడియెన్స్ కు బాగా కనెక్ట్ అయ్యింది. ఈ సినిమాలో ఆనంద్ దేవరకొండ మంచి నటనతో ప్రేక్షకులను మెప్పించాడు.

అయితే ఆనంద్ దేవరకొండ తన మూడవ సినిమా బడా నిర్మాతతో చేయబోతున్నాడని టాలీవుడ్ లో వార్తలు వినిపిస్తున్నాయి. టాలీవుడ్ బడా నిర్మాత సురేష్ బాబు ప్రొడక్షన్ లో ఆనంద్ దేవరకొండ లక్కీ ఛాన్స్ కొట్టేసినట్లు తెలుస్తోంది. దర్శకుడిగా కళ్యాణ్ రామ్ 118 సినిమాను తెరకెక్కించిన కెవి.గుహన్ అని తెలుస్తుంది. మరి ఈ సినిమాతో తన రేంజ్ ఇంకా పెరిగే ఛాన్స్ కనిపిస్తుంది. అఫీషియల్ ఎనౌన్స్మెంట్ వస్తే కానీ పూర్తి వివరాలు తెలియదు.

No comment allowed please