#KandiPodi : కోనసీమ స్పెషల్ కంది పొడి ప్రిపరేషన్

కోనసీమ జిల్లాల వారు ఎక్కువగా తయారు చేసుకుంటారు.

Kandi Podi  : తెలుగువారు పచ్చళ్ళన్నా, కారం పొడులన్న చాలా ఇష్టంగా తింటారు. అందులో ఒకటి కంది పొడి. ఇది కోనసీమ జిల్లాల వారు ఎక్కువగా తయారు చేసుకుంటారు. ఉదయంపూట టిఫిన్స్ లో ఈ కంది పొడి తింటారు. ఇది తయారు చేసుకోవడం చాలా సులువు. ఒక్కసారి తయారు చేసుకుంటే నెల రోజుల వరకు నిల్వ ఉంటుంది. ఇప్పుడు మనం తెలుగువారికి ఇష్టమైన కంది పొడి ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం..

కావలసిన పదార్థాలు :

కందులు – 1 కప్పు
పుట్నాలు – 1 కప్పు
జీలకర్ర – 3 టీ స్పూన్లు
మెంతులు – 1/2 టీ స్పూను
వెల్లుల్లి – 10 రెబ్బలు
ఉప్పు – రుచికి సరిపడ
ఎండు మిరపకాయలు – 10
కరివేపాకు – 2 రెమ్మలు
ఇంగువ – చిటికెడు

తయారుచేయు విధానం :

ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి కందులను వేసి కొద్దిగా వేగిన తర్వాత పుట్నాల పప్పును వేసి వేయించి పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే పాన్ లో రెండు స్పూన్ల ఆయిల్ వేసి అందులో జీలకర్ర, ఎండుమిర్చి, మెంతులు, కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు వేసి మాడిపోకుండా సన్నని మంట మీద జాగ్రత్తగా వేయించుకోవాలి. మిశ్రమం చల్లారాక మిక్సీ జార్‌లో వేసి అందులో సరిపడా ఉప్పు, కొంచెం ఇంగువ వేసి మరీ మెత్తగా కాకుండా కొద్దిగా బరకగా మిక్సీ చేసుకోవాలి. తర్వాత ఈ మిశ్రమానికి వేయించుకుని పెట్టుకున్న కందిపప్పు, పుట్నాల పప్పు కూడా వేసి మిక్సీ చేసుకోవాలి. అంతే ఎంతో రుచిగా ఉండే తెలుగువారికి ఇష్టమైన కంది పొడి రెడీ అయినట్లే. ఈ పొడిని ఇడ్లీతోపాటు ఇతర టిఫిన్లతో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది.

No comment allowed please