#SouravGanguly : గంగూలీ కి మ‌రో రెండు స్టెంట్లు – నిల‌క‌డ‌గా ఆరోగ్యం

దాదాను ప‌రామ‌ర్శించిన దీదీ

Sourav Ganguly : భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ కెప్టెన్, ప్ర‌స్తుత బీసీసీఐ ప్రెసిడెంట్ అంద‌రూ ముద్దుగా పిలుచుకునే దాదా ఆరోగ్య ప‌రిస్థితి నిల‌క‌డ‌గానే ఉంద‌ని కోల్‌క‌తాలోని అపొలో ఆస్ప‌త్రి వ‌ర్గాలు వెల్ల‌డించాయి. అయితే గంగూలీకి మ‌రో మారు యాంజియోప్లాస్టీ చేయ‌డం జ‌రిగింద‌ని తెలిపారు. గుండె ర‌క్త‌నాళాల్లో ఏర్ప‌డిన రెండు పూడిక‌ల‌కు స్టెంట్లు వేశామని పేర్కొన్నాయి.

ఈనెల 2న గంగూలీ త‌న ఇంట్లో జిమ్ ప్రాక్టీస్ చేస్తుండ‌గా అనుకోకుండా ఛాతిలో నొప్పి వ‌చ్చింది. వెంట‌నే ఆయ‌నను కుటుంబీకులు వుడ్ ల్యాండ్ ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. అక్క‌డ యాంజియో ప్లాస్టీ చేశారు. ప‌రిస్థితి అంతా బాగుంద‌ని 7న గంగూలీని(Sourav Ganguly) డిశ్చార్జ్ చేశారు. అంతా బాగుంద‌నుకునే లోపే మ‌రోసారి దాదా ఛాతీలో నొప్పి స్టార్ట్ అయింది. క్ష‌ణం ఆల‌స్యం చేయ‌కుండా అపోలోకి త‌ర‌లించారు.

వైద్య ప‌రీక్ష‌లు చేసి మ‌రో రెండు స్టెంట్లు వేసింది. గ‌తంలో యాంజియో ప్లాస్టీ నిర్వ‌హించిన స‌మ‌యంలోనే ధ‌మ‌నుల్లో మూడు చోట్ల పూడిక‌లు ఉన్న‌ట్లు గుర్తించిన వైద్యులు ఒక స్టంట్ మాత్ర‌మే వేశారు. ఆరోగ్ ప‌రిస్థితిని బ‌ట్టి మిగిలిన రెండు స్టెంట్లు త‌ర్వాత వేయాల‌ని నిర్ణ‌యించారు. మ‌రోసారి ఆయ‌న ఇబ్బందుల‌కు గురి కావ‌డంతో త‌ప్ప‌ని స‌రి వీటిని వేయాల్సి వ‌చ్చింద‌ని ఆస్ప‌త్రి వ‌ర్గాలు వెల్ల‌డించాయి.

ఇదిలా ఉండ‌గా ఎన్నిక‌ల షెడ్యూలు ఉండడం, అసెంబ్లీ స‌మావేశాలు కావ‌డంతో ప‌శ్చిమ బెంగాల్ ముఖ్య‌మంత్రి మ‌మ‌తా బెన‌ర్జీ త‌న‌ను క‌ల‌వ‌లేక పోయారు. మీటింగ్ అనంత‌ర‌మే హుటా హుటిన అపోలోకు వెళ్లారు. అక్క‌డ గంగూలీని(Sourav Ganguly) ప‌రామ‌ర్శించారు. ఆయ‌న ఆరోగ్య ప‌రిస్థితి గురించి వైద్యులు వివ‌రించారు.

మెరుగైన వైద్య చికిత్స‌ను అందించాల‌ని సీఎం ఆదేశించారు. కాగా మ‌మ‌త‌కు గంగూలీ అంటే అభిమానం. ఆమె త‌న‌ను దాదా అని ఆప్యాయంగా పిలుస్తారు. ఆయ‌న ఆరోగ్యం నిల‌క‌డ‌గా ఉంద‌ని తెలియ‌డంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.

No comment allowed please