Anand Mahindra : విలువైన కాలం తిరిగి రాదు మ‌స్క్

ఆనంద్ మ‌హీంద్ర సంచ‌ల‌న కామెంట్స్

Anand Mahindra : ప్ర‌పంచంలో పేరొందిన వ్యాపార‌వేత్త‌లు, కంపెనీలు, సిఇఓలు, చైర్మ‌న్లు డ‌బ్బుల కంటే ఎక్కువ‌గా కాలానికి ప్ర‌యారిటీ ఇస్తారు. ఎందుకంటే ప్ర‌తి నిమిషం వాళ్లంద‌రికీ కోట్ల‌ల్లో స‌మానం.

అలాంటిది టెస్లా సిఇఓ, చైర్మ‌న్ గా పేరొందిన ఎలోన్ మ‌స్క్ ప్ర‌పంచంలో మోస్ల్ పాపుల‌ర్ బిలియనీర్ గా పేరొందారు. ఒక ర‌కంగా చెప్పాలంటే ఆయ‌న ఏది చేతుల్లోకి తీసుకుంటే అది బంగార‌మే.

కానీ ముందూ వెనుకా ఆలోచించ‌కుండా ఒక్కోసారి త‌ప్పులు కూడా చేస్తార‌ని ఎలోన్ మ‌స్క్ విష‌యంలో అర్థ‌మైంది. అమెరికాకు చెందిన సోష‌ల్ మీడియాను ఏలుతున్న ట్విట్ట‌ర్ కంపెనీలో వేలు పెట్టాడు.

దాని షేర్లు కొన్నింటిని కొనుగోలు చేశాడు. ఆపై $44 బిలియ‌న్ డాల‌ర్ల‌కు కొనుగోలు చేసేందుకు ఒప్పందం చేసుకున్నాడు. తీరా త‌న‌కు న‌కిలీ ఖాతాలు ఎన్ని ఉన్నాయో చెప్పాలంటూ గిల్లి క‌జ్జాల‌కు దిగాడు.

ఆపై ప్ర‌వాస భార‌తీయుడైన టెక్ దిగ్గ‌జం సిఇఓగా ఉన్న ప‌రాగ్ అగ‌ర్వాల్, ట్విట్ట‌ర్ సిబ్బందిపై నోరు పారేసుకున్నాడు. రోజూ ట్వీట్ల‌తో హోరెత్తించాడు. చివ‌ర‌కు చావు క‌బురు చ‌ల్ల‌గా చెప్పాడు.

తాను ట్విట్ట‌ర్ ను కొనుగోలు చేయ‌డం లేదంటూ ప్ర‌క‌టించాడు. దీంతో ట్విట్ట‌ర్ ఇప్పుడు ఒప్పందం మేర‌కు 1$ బిలియ‌న్ డాల‌ర్ల‌ను పెనాల్టీగా చెల్లించాలంటూ నోటీసులు జారీ చేసింది.

దీంతో మ‌నోడికి వ్యాపారం వేరు వ్య‌వ‌హారం వేరు అన్న సంగ‌తి అర్థ‌మైంది. ఇది కోర్టు దాకా వెళుతుంది. ఇది ప‌క్క‌న పెడితే భార‌తీయ వ్యాపార‌వేత్త ఆనంద్ మ‌హీంద్రా(Anand Mahindra) సంచ‌ల‌న కామెంట్స్ చేశారు ఎలోన్ మ‌స్క్ పై.

ప‌రువు ప‌క్క‌న పెడితే విలువైన టైమ్, మ‌నీ, ప్రశాంత‌త కోల్పోవ‌డం అవ‌స‌ర‌మా అంటూ ట్వీట్ చేశారు. ప్ర‌స్తుతం ఆయ‌న చేసిన ట్వీట్ వైర‌ల్ గా మారింది.

Also Read : మైక్రోసాఫ్ట్ లో ఉద్యోగాల కోత

Leave A Reply

Your Email Id will not be published!