Ananta Padmanabha Vratham : ఘ‌నంగా అనంత ప‌ద్మ నాభ వ్రతం

తిరుమ‌లలో కొలువు తీరిన భ‌క్తులు

Ananta Padmanabha Vratham : తిరుమ‌ల – ప‌విత్ర పుణ్య క్షేత్రం తిరుమ‌ల భ‌క్తుల‌తో కిట కిట లాడుతోంది. గురువారం తిరుమ‌ల‌లో అనంత ప‌ద్మ నాభ వ్ర‌తం(Ananta Padmanabha Vratham) అంగ‌రంగ వైభవంగా జ‌రిగింది. ఇందులో భాగంగా ఇవాళ ఉద‌యం శ్రీ‌వారి సుద‌ర్శ‌న చక్రత్తాళ్వారును ఆలయం నుండి ఊరేగింపుగా శ్రీ భూవరాహ స్వామి ఆలయం వద్ద నున్న స్వామి వారి పుష్కరిణి చెంతకు వేంచేపు చేశారు.

అక్కడ చక్రత్తాళ్వార్లకు అభిషేకాదులు నిర్వహించిన అనంతరం శాస్త్రోక్తంగా చక్ర స్నానం నిర్వహించారు.

Ananta Padmanabha Vratham in Tirumala
ఇదిలా ఉండ‌గా పుణ్య క్షేత్రంలో ప్రతి సంవత్సరం బాధ్రపద మాస శుక్ల చతుర్దశి పర్వ దినాన అనంత పద్మనాభ స్వామి వ్రతం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.

మహిళల సౌభాగ్యం కోసం వరలక్ష్మి వ్రతం ఎలా చేస్తారో, పురుషుల‌కు సంబంధించి సిరి సంప‌ద‌ల కోసం అనంత ప‌ద్మ నాభ వ్ర‌తాన్ని నిర్వహిస్తారు. పాల స‌ముద్రంలో శేష శ‌య్య మీద ప‌వ‌ళించి ఉండే దివ్య మంగ‌ళ స్వ‌రూప‌మే అనంత ప‌ద్మ నాభుడు.

ఈ వ్రతంలో భూ భారాన్ని మోస్తున్న అనంతుడిని, ఆ ఆదిశేషుడిని శయ్యగా చేసుకుని పవళించి ఉన్న శ్రీ మహా విష్ణువును పూజిస్తారు. ఈ కార్యక్రమంలో శ్రీవారి ఆలయ అర్చకులు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

Also Read : Bandlaguda Laddu : రికార్డు ధ‌ర ప‌లికిన గ‌ణేశుడి ల‌డ్డు

Leave A Reply

Your Email Id will not be published!