Ananth Ambani: ద్వారకలో ముగిసిన అనంత్ అంబానీ పాదయాత్ర
ద్వారకలో ముగిసిన అనంత్ అంబానీ పాదయాత్ర
Ananth Ambani : రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ(Ananth Ambani) చేపట్టిన పాదయాత్ర ద్వారకలో ముగిసింది. మార్చి 29న జామ్నగర్ నుంచి చేపట్టిన ఈ పాదయాత్ర 170 కిలోమీటర్లమేర సాగింది. ఆదివారం ఈ పాదయాత్ర ద్వారకకు చేరుకోవడంతో అక్కడ దీనిని ముగించారు. శ్రీరామనవమి పర్వదినంతో పాటు హిందూ క్యాలెండరు ప్రకారం తన పుట్టినరోజు నాడు అనంత్ ద్వారకాధీశుని సన్నిధికి చేరుకోవడం విశేషం. ఈ సందర్భంగా తల్లి నీతా అంబానీ, భార్య రాధికా మర్చంట్ లతో కలిసి శ్రీ కృష్ణుడిని దర్శించుకొని అనంత్ అంబానీ ప్రత్యేక పూజలు చేశారు.
Ananth Ambani Dwaraka Padayatra..
ఆధ్యాత్మిక అన్వేషణ పేరుతో మార్చి 29న మొదలైన ఈ పాదయాత్ర తొమ్మిది రోజులపాటు కొనసాగింది. కొంతమంది సహాయకులు, ఆధ్యాత్మిక మార్గదర్శకులు యాత్రలో వెంట నడిచారు. ఈ సందర్భంగా యువతను ఉద్దేశించి అనంత్ మాట్లాడుతూ… ‘‘మీ భక్తి మిమ్మల్ని ముందుకు నడిపించనివ్వండి. అది సవినయంగా మిమ్మల్ని తీర్చిదిద్దనివ్వండి. జీవితం భారంగా అనిపించినపుడు మీ విశ్వాసం మిమ్మల్ని ముందుకు తీసుకువెళ్లనివ్వండి’’ అన్నారు. నీతా అంబానీ స్పందిస్తూ… తన కుమారుడు 9 రోజుల పాదయాత్రతో ద్వారకకు చేరుకోవడం గర్వంగా ఉందన్నారు. అనంత్ కు మరింత బలాన్ని, ఆరోగ్యాన్ని ఇవ్వాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.
Also Read : Kunal Kamra: బాంబే హైకోర్టును ఆశ్రయించిన స్టాండప్ కమెడియన్ కుణాల్ కామ్రా