Anantkumar Hegde: బీజేపీ గెలిస్తే రాజ్యాంగంలో మార్పులు చేస్తాం ! బీజేపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు !
బీజేపీ గెలిస్తే రాజ్యాంగంలో మార్పులు చేస్తాం ! బీజేపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు !
Anantkumar Hegde: మాజీ కేంద్ర మంత్రి, బీజేపీ ఎంపీ అనంత్ కుమార్ హెగ్డే సంచలన వ్యాఖ్యలు చేశారు. రానున్న సార్వత్రిక ఎన్నికలల్లో బీజేపీ మూడింట రెండు వంతుల ఎంపీ సీట్లలో గెలుపొంది… తిరిగి అధికారంలోకి వస్తే రాజ్యాంగంలో కొన్ని మార్పులు చేస్తామని అన్నారు. రాజ్యాంగంలోని పీఠికలో ఉన్న ‘లౌకికవాదం’ను తొలగిస్తామని అన్నారు. ప్రస్తుతం ఆయన చేసిన వ్యాఖ్యలు దేశ రాజకీయాల్లో దుమారం రేపుతున్నాయి. అనంత్ కుమార్ హెగ్డే(Anantkumar Hegde) వ్యాఖ్యలపై స్వంత పార్టీ బీజేపీలో కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో హెగ్డే వ్యాఖ్యలు వ్యక్తిగతం… వాటితో పార్టీకు ఎలాంటి సంబంధం లేదంటూ బీజేపీ కర్ణాటక శాఖ తన అధికారిక సోషల్ మీడియా ఎక్స్ ద్వారా తెలిపింది.
Anantkumar Hegde Comment
‘అనవసరమైన అంశాలను కాంగ్రెస్ బలవంతంగా చొప్పించి రాజ్యాంగాన్ని వక్రీకరించింది. ముఖ్యంగా హిందూ సామాజాన్ని అణచివేసే చట్టాలను తీసుకుచ్చింది. వాటిలో మార్పులు తీసుకురావాలంటే బీజేపీకి ప్రస్తుతం ఉన్న మెజార్టీ సరిపోదు. కాంగ్రెస్ మెజార్టీ లోక్‌సభ స్థానాలు గెలువలేదు. మోదీ నాయకత్వంలో బీజేపీ లోక్ సభలో మూడింట రెండు వంతుల సీట్లను గెలుస్తుంది. అయితే లోక్‌సభ, రాజ్యసభల్లో మూడింట రెండువంతుల సీట్లను బీజేపీ గెలవటంతో పాటు… అదే స్థాయిలో 20 రాష్ట్రాల్లో కూడా బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగంలో మార్పులు తీసుకురావచ్చు’ అని అనంత్‌కుమార్ హెగ్డే అన్నారు.
అనంత్‌కుమార్ హెగ్డే చేసిన వ్యాఖ్యలు వివాదస్పదం అయ్యాయి. హెగ్డే వ్యాఖ్యలపై కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ స్పందిస్తూ… బీజేపీ రాజ్యాంగ వ్యతిరేకమైన పార్టీ అని మండిపడ్డారు. ఆయన వ్యాఖ్యలతో కేంద్రంలోని బీజేపీకి అంబేద్కర్ రాసిన రాజ్యాంగంపై వ్యతిరేకత ఎంత ఉందో అర్థమవుతోందని దుయ్యబట్టారు. దీనితో కర్ణాటక బీజేపీ ‘ఎక్స్’వేదికగా స్పందిస్తూ.. ‘ఎంపీ అనంత్‌కుమార్ హెగ్డే రాజ్యాంగంపై చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమైనవి.. వాటితో పార్టీకి ఎటువంటి సంబంధిం లేరు. ఆయన వ్యాఖ్యలు పార్టీని ప్రతిబింబించవు. ఆయన చేసిన వ్యాఖ్యలపై మేము వివరణ కోరుతాం’ అని బీజేపీ పేర్కొంది.
Also Read : KV Ramanareddy: నేనే సీఎం – అంటూ బీజేపీ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి సంచలన వ్యాఖ్యలు !