#Anasuya : అనసూయ సాంగ్ కోసం ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటుందో తెలుసా?

యాంకర్ అనసూయ అంటే తెలియని తెలుగు వారు ఉండరేమో.. అంతగా పాపులర్ అయ్యింది.

Anasuya : యాంకర్ అనసూయ అంటే తెలియని తెలుగు వారు ఉండరేమో.. అంతగా పాపులర్ అయ్యింది. బుల్లితెరలో ప్రసారమయ్యే జబర్దస్త్ ప్రోగ్రాంతో ఎంతో పాపులారిటీ సొంతం చేసుకుంది. అప్పుడప్పుడూ వెండితెర మీద కూడా కనిపిస్తూ అలరిస్తుంది. రంగస్థలం సినిమాలో రంగమత్తలా నటించి మంచి మార్కులు కొట్టేసింది.

అంతేకాదు అప్పుడప్పుడూ స్పెషల్ సాంగ్స్ లో కూడా మెరుస్తుంది. వరుణ్ తేజ్, వెంకటేష్ కలిసి నటించిన F2 సినిమాలో ఒక ఐటెం సాంగ్.. సాయి ధరమ్ తేజ్ నటించిన విన్నర్ సినిమాలో మరొక ఐటెం సాంగ్ చేసి మెప్పించింది. తాజాగా మరో సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ ఒప్పుకుందని సమాచారం.

అయితే ఇప్పుడు కార్తికేయ నటిస్తున్న చావు కబురు చల్లగా సినిమాలో ఒక సాంగ్ ఒప్పుకుంది. ఈ సినిమాలో లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటిస్తుంది. అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమాలో చేస్తున్న సాంగ్ కోసం అనసూయకు 20 లక్షలు చెల్లిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ సాంగ్ షూటింగ్ కూడా జరుగుతున్నట్లు తెలుస్తుంది.

No comment allowed please