#PawanKalyan : ‘హర హర వీరమల్లు’గా రాబోతున్న పవన్..

Pawan Kalyan : దాదాపు రెండు సంవత్సరాల తర్వాత పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమాతో మళ్ళీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అటు రాజకీయాలతోపాటు.. వరస పెట్టి సినిమాలు చేస్తూ బిజీ బిజీగా ఉన్నాడు.

అయితే పవన్ కళ్యాణ్ క్రిష్ దర్శకత్వంలో నటిస్తున్న సినిమా మీద కూడా భారీ అంచనాలు ఉన్నాయి.

ఈ సినిమా గురించి సోషల్ మీడియాలో చాలా రకాల వార్తలు బయటకు వస్తున్నాయి.

ఈ సినిమాను దాదాపు 180 కోట్ల బడ్జెట్ తో ఏఎమ్ రత్నం దీన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారని వార్తలు వస్తున్నాయి.

అంతేకాదు ఇందులో పవన్ కళ్యాణ్ వజ్రాల దొంగగా నటిస్తున్నాడని కూడా ప్రచారం జరుగుతుంది.

ఈ సినిమాలో కోహినూర్ డైమెండ్ గురించి కూడా చూపిస్తున్నారని తెలుస్తుంది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ గుర్రపు స్వారీతో పాటు కత్తి, కర్రసాములు కూడా చేయబోతున్నాడని అంటున్నారు.

అంతే కాదు ఈ సినిమా టైటిల్ గురించి కూడా ఎప్పటినుండో చర్చలు జరుగుతున్నాయి.

రకరకాల పేర్లు బయటకు వచ్చాయి. తాజాగా హర హర వీరమల్లు అనే టైటిల్ ను రిజిస్టర్ కూడా చేయించారని టాక్.

ఈ సినిమాలో శ్రీలంకన్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ హీరోయిన్‌గా నటిస్తుందని సమాచారం.

మరొక హీరోయిన్ గా నిధి అగర్వాల్ నటిస్తుందని ఇప్పటికే ఈమెతో కొన్ని సీన్స్ కూడా తీసారని.. ఇలా రకరకాల న్యూస్లు బయటకు వచ్చాయి.

No comment allowed please