Anchor Swetcha Votarkar: ప్రముఖ న్యూస్ యాంకర్‌ స్వేచ్ఛ ఆత్మహత్య

ప్రముఖ న్యూస్ యాంకర్‌ స్వేచ్ఛ ఆత్మహత్య

Swetcha Votarkar : తెలుగు జర్నలిస్ట్ వర్గాల్లో తీవ్ర విషాదం నెలకొంది. న్యూస్ రీడర్, యాంకర్‌ స్వేచ్ఛ వోటార్కర్‌ (40) శుక్రవారం బలవర్మణానికి పాల్పడ్డారు. చిక్కడపల్లి ఠాణా పరిధి జవహర్‌నగర్‌లోని ఆమె నివాసంలో రాత్రి 10.30 గంటలకు ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. చిక్కడపల్లి ఇన్‌స్పెక్టర్‌ రాజు నాయక్‌ తెలిపిన వివరాల ప్రకారం… ఫ్యానుకు లుంగీతో ఉరేసుకొని తనువు చాలించింది. ఐదేళ్ల క్రితం భర్తతో విడాకులు తీసుకున్న ఆమెకు ఒక కుమార్తె ఉన్నారు. అయితే పూర్ణ చంద్రరావు అనే వ్యక్తితో ఆమె సహాజీవనం చేస్తుంది. ఆమె మృతికి కారణాలు తెలియాల్సి ఉంది.

స్వేచ్ఛ న్యూస్ రీడర్, ప్రేసెంటెర్, యాంకర్ గా పలు న్యూస్ చానెల్స్ లో పని చేశారు. డిజిటల్ కంటెంట్ క్రియేటర్ గాను ఈమె గుర్తింపు తెచ్చుకున్నారు. ఇటీవల జర్నలిస్టు హౌసింగ్‌ సొసైటీ ఎన్నికల్లో స్వేచ్ఛ (Swetcha Votarkar) ఈసీ మెంబర్‌గా ఎన్నికయ్యారు. చిన్న వయసులో యాంకర్ స్వేచ్ఛ… అదీ బలవన్మరణానని పాల్పడటం పట్ల పలువురు జర్నలిస్టులు దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు. స్వేచ్ఛ తల్లిదండ్రులు రాంనగర్‌ లో ఉంటున్నారు. తండ్రి శంకర్‌ ఉమ్మడి ఏపీలో పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేయగా… తల్లి శ్రీదేవి చైతన్య మహిళా సంఘంలో పనిచేస్తున్నారు. తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Swetcha Votarkar – స్వేచ్ఛ మృతి కేసులో ట్విస్ట్

తెలుగు న్యూస్‌ రీడర్‌, యాంకర్‌ స్వేచ్ఛ వోటార్కర్‌ (Swetcha Votarkar) ఆత్మహత్య కేసు కీలక మలుపు తిరిగింది. తమ బిడ్డ మృతిపై అనుమానాలు ఉన్నాయంటూ ఆమె తల్లిదండ్రులు చిక్కడపల్లి పోలీసులను ఆశ్రయించారు. దీనితో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని పోలీసులు విచారణ చేపట్టారు.

పలు టీవీ ఛానెల్స్‌లో పని చేసిన స్వేచ్ఛకు… గతంలోనే వివాహమైంది. ఓ కూతురు కూడా ఉంది. మనస్పర్థలతో భర్త నుంచి విడిపోయాక పూర్ణ చంద్రరావు అనే వ్యక్తితో ఆమె కలిసి ఉంటోంది. ఆమె ఫేస్‌బుక్‌ పేజీ పేరు సైతం స్వేచ్ఛా పూర్ణ చందర్‌గా మార్చుకుంది. అయితే కొన్నాళ్లుగా వీళ్ల మధ్యా విభేదాలు నడుస్తున్నట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. తనను వివాహం చేసుకోవాలని పూర్ణ చంద్రరావు… స్వేచ్ఛ ఒత్తిడి చేయగా… అందుకు పూర్ణ చంద్రరావు నిరాకరించాడు. దీంతో అతనితో ఇక కలిసి ఉండలేనంటూ ఆమె తల్లిదండ్రుల వద్ద వాపోయింది. ఈ విషయంలోనే ఆమె మనస్తాపం చెంది బలవన్మరణానికి పాల్పడి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఘటన తర్వాతి నుంచి పూర్ణచంద్రరావు ఫోన్‌ స్విచ్ఛాప్‌ వస్తోంది. అజ్ఞాతంలో ఉన్న అతని ఆచూకీ కనుగొనేందుకు పోలీసులు ప్రయత్నిస్తు‍న్నారు.

Also Read : Uddhav Thackeray: ఒకే వేదికపైకి ఠాక్రే సోదరులు ?

Leave A Reply

Your Email Id will not be published!