Andhra Pradesh Government: పెట్రోల్ పంపిణీపై ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం !

పెట్రోల్ పంపిణీపై ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం !

Andhra Pradesh: పోలింగ్ అనంతరం పలు జిల్లాల్లో చోటు చేసుకున్న హింసాత్మక ఘటనల దృష్ట్యా… పెట్రోల్ పంపిణీ విషయంలో ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్‌ లోని పెట్రోల్ బంక్‌ లపై రాష్ట్ర ప్రభుత్వం ఆంక్షలు విధించింది. పెట్రోల్ బంక్‌ లలో ఖాళీ బాటిల్, క్యానులలో పెట్రోల్ అమ్మకాలపై ప్రభుత్వం తాత్కాలికంగా నిషేధం విధించింది. ఖాళీ బాటిళ్ళలో పెట్రోల్ పడితే బంక్ యాజమానిపై క్రిమినల్ కేసులు పెడతామని ప్రభుత్వం హెచ్చరిచింది. ఎన్నికల అనంతరం అవాంఛనీయ ఘటనల నేపథ్యంలో సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాష్ట్రంలో ప్రతి పెట్రోల్ బంక్ వద్ద నోటీస్ బోర్డు ఏర్పాటు చేయాలని సంబంధిత యాజమాన్యానికి ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు బంక్ యాజమాన్యం తప్పక జాగ్రత్తలు పాటించాలని అసోసియేషన్ కూడా పిలుపునిచ్చింది. ప్రభుత్వం ఆదేశాలను తప్పక పాటించాలని ఈ మేరకు పెట్రోల్ బంక్ అసోషియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు రావి గోపాలకృష్ణ, అసోసియేషన్ జనరల్ సెక్రటరీ పేరం రవి.. పెట్రోల్ బంక్ యాజమాన్యాలను కోరారు.

Andhra Pradesh Government

2024 సార్వత్రిక ఎన్నికల పోలింగ్ అనంతరం ఏపీలో పలు చోట్ల హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నారు. ముఖ్యంగా తిరుపతి, అనంతపురం, పల్నాడు జిల్లాల్లో శాంతి భద్రతలు అదుపు తప్పాయి. వైసీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య పెద్ద ఎత్తున దాడులు జరిగాయి. దాడులు జరిగిన పల్నాడు, అనంతపురం, తిరుపతి జిల్లాల్లో 144 సెక్షన్ పెట్టడంతో ఇప్పుడిప్పుడే పరిస్థితులు చక్కబడుతున్నాయి. పోలింగ్ అనంతరం జరిగిన హింసాత్మక ఘటనలపై సీరియస్ గా స్పందించిన కేంద్ర ఎన్నికల సంఘం… ఆయా జిల్లాల పోలీసు ఉన్నతాధికారులపై బదిలీ వేటు వేయడంతో పాటు… ఘటనలపై సమగ్ర దర్యాప్తుకు సిట్ ను నియమించింది. అయితే జూన్ 04న, ఆ తర్వాత కూడా గొడవలు జరిగే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ అలర్ట్ చేయడంతో… ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధం చేసుకుంది. ఈ పరిస్థితుల్లో ఖాళీ బాటిళ్ళలో పెట్రోలు అమ్మకాలపై జగన్ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది.

Also Read : Konidela Nagababu: ‘ఎక్స్’ లోనికి నాగబాబు రీ ఎంట్రీ !

Leave A Reply

Your Email Id will not be published!