Anganwadi Protest : ఎస్ఐపై అంగన్ వాడీల కన్నెర్ర
జుట్టుపట్టి లాక్కెల్లిన కార్యకర్తలు
Anganwadi Protest : ఆదిలాబాద్ – తెలంగాణ ప్రభుత్వం ఆర్డర్స్ పాస్ చేసినా అంగన్ వాడీలు ఆగడం లేదు. సీఎం కేసీఆర్(KCR) ఇచ్చిన తాయిలాలు తమకు వద్దని ప్రకటించారు. ఇప్పటికే సీరియస్ కామెంట్స్ చేశారు. త్వరలో తెలంగాణలో ఎన్నికలు రానున్నాయి. అంగన్ వాడీలు కీలకంగా మారనున్నారు.
Anganwadi Protest Viral in Telangana
దీంతో బుధవారం ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. ఆదిలాబాద్ జిల్లా కలెక్టరేట్ ముట్టడి ఉద్రిక్తంగా మారింది. పెద్ద ఎత్తున అంగన్ వాడీలు అక్కడికి చేరుకున్నారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు. తమను బయటకు లాగుతున్న లేడీ కానిస్టేబుల్, ఎస్ఐ లకు చుక్కలు చూపించారు.
తాము అన్యాయం చేయడం లేదని, కావాల్సిన హక్కుల కోసం పోరాడుతుంటే మీరు ఎందుకు అడ్డు తగులుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తమను అక్రమంగా తోసి వేస్తున్న ఎస్ఐకి చుక్కలు చూపించారు.
ఆమె జట్టును పట్టుకుని లాక్కుని వెళ్లారు. దీంతో ఆమె అరిచి గీ పెట్టినా వదిలేది మహిళా అంగన్ వాడీలు. తమకు కనీసం రూ. 25 వేలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. లేక పోతే బీఆర్ఎస్ సర్కార్ కు చుక్కలు చూపిస్తామంటూ హెచ్చరిస్తున్నారు.
Also Read : Hamsa Vahanam : సింహ వాహనంపై శ్రీనివాసుడు