Anil K Antony Resign : కాంగ్రెస్ కు అనిల్ కే ఆంటోనీ గుడ్ బై
మోడీపై విద్వేషం మంచిది కాదని కామెంట్
Anil K Antony Resign : కేరళ కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. సీనియర్ నాయకుడు ఏకే ఆంటోనీ కుమారుడు అనిల్ కే ఆంటోనీ రాజీనామా చేస్తున్నట్లు(Anil K Antony Resign) ప్రకటించారు. ఈ దేశంలో ద్వేష పూరిత వాతావరణం నెలకొందని, ప్రేమ కావాలంటూ రాహుల్ గాంధీ ఓ వైపు భారత్ జోడో యాత్ర చేస్తున్నారని కానీ మరో వైపు కాంగ్రెస్ పార్టీ వ్యక్తిగత ద్వేషంతో కేవలం ప్రధానమంత్రి మోడీని టార్గెట్ చేస్తోందంటూ ఆరోపించారు.
తాజాగా ప్రపంచ వ్యాప్తంగా ప్రముఖ మీడియా సంస్థ బీబీసీ మోడీపై ప్రత్యేక కథనం రెండు విభాగాలుగా రూపొందించింది. దీనిపై పెద్ద ఎత్తున రాద్దాంతం చోటు చేసుకుంది. కాగా ఇప్పటికే బీబీసీ కావాలని మోడీ ప్రతిష్టను దిగజార్చేందుకు రహస్య ఎజెండాతో తయారు చేసిందంటూ కేంద్ర ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఆపై బీబీసీ మోడీకి సంబంధించిన లింకులను వెంటనే నిలిపి వేయాలని ఆదేశించింది. అదే సమయంలో ఆయా లింకులు కలిగి ఉన్న సామాజిక మాధ్యమాలకు హుకూం జారీ చేసింది. అయితే ప్రతిపక్షాలు మాత్రం తీవ్రంగా మండిపడ్డాయి. కేంద్ర సర్కార్ తీరును ఎండగట్టాయి.
ఈ తరుణంలో మోడీని కాంగ్రెస్ పార్టీ ఎండగట్టడాన్ని, వ్యక్తిగతంగా దూషించడాన్ని అభ్యంతరం వ్యక్తం చేశారు ఏకే ఆంటోనీ కుమారుడు అనిల్ కే ఆంటోనీ. ఈ క్రమంలో పార్టీ నిర్ణయంపై అసహనం వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు. తనకు చెందిన పదవులన్నింటి నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు.
ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రస్తుతం అనిల్ కే ఆంటోనీ రాజీనామా(Anil K Antony Resign) వ్యవహారం కాంగ్రెస్ లో కలకలం రేపుతోంది.
Also Read : పెరుమాళ్ కు రాహుల్ థ్యాంక్స్