Anil Kumar Yadav : చంద్ర‌బాబు..నారాయ‌ణ తోడు దొంగ‌లు

మాజీ మంత్రి అనిల్ కుమార్ యాద‌వ్

Anil Kumar Yadav : నెల్లూరు జిల్లా – టీడీపీ చీఫ్ , మాజీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు, మాజీ మంత్రి కొన‌క‌ళ్ల నారాయ‌ణ ఇద్ద‌రూ తోడు దొంగ‌ల‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాద‌వ్(Anil Kumar Yadav). ఆదివారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. ఇద్ద‌రూ క‌లిసి వంద‌ల ఎక‌రాల భూములు దోచుకున్నార‌ని , త్వ‌ర‌లోనే అన్ని విష‌యాలు వెలుగులోకి వ‌స్తాయ‌ని స్ప‌ష్టం చేశారు.

Anil Kumar Yadav Slams Chandrababu and Narayana

ఇప్ప‌టికే స్కిల్ స్కాం కేసులో అడ్డంగా బుక్ అయ్యార‌ని, ఇక అమ‌రావ‌తి ఇన్న‌ర్ రింగ్ రోడ్డు ఎన్ లైన్ మెంట్ కేసులో కీల‌క పాత్ర నారాయ‌ణ‌తో పాటు మాజీ మంత్రి నారా లోకేష్ కు కూడా పాత్ర ఉంద‌ని ఏపీ సీఐడీ ఇప్ప‌టికే వెల్ల‌డించింద‌ని తెలిపారు.

ఒక‌వేళ తాము అక్ర‌మాల‌కు పాల్ప‌డ‌క పోతే ఆధారాలు చూపించాల‌ని స‌వాల్ విసిరారు. కేవ‌లం ప్ర‌జ‌ల‌ను త‌ప్పు దోవ ప‌ట్టించేందుకే ఇలాంటి ఫేక్ ధ‌ర్నాలు, ఆందోళ‌న‌లు చేస్తున్నారంటూ ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ఈసారి టీడీపీకి పుట్ట‌గ‌తులు ఉండ‌వ‌న్నారు.

దేశంలో ఎక్క‌డా లేని రీతిలో ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్రం అన్ని వ‌ర్గాల సంక్షేమం కోసం కృషి చేస్తోంద‌ని చెప్పారు. త‌మ‌కు ఎలాంటి ఢోకా లేద‌న్నారు. నిన్న మొన్న‌టి దాకా బీరాలు ప‌లికిన జ‌న‌సేన పార్టీ చీఫ్ ఇప్పుడు ఎక్క‌డ ఉన్నాడంటూ ప్ర‌శ్నించారు అనిల్ కుమార్ యాద‌వ్. జ‌గ‌న‌న్న సుర‌క్ష అనేది జ‌నానికి శ్రీ‌రామ ర‌క్ష అని ప్ర‌శంసించారు.

Also Read : Perni Nani : లంచాలు తిని కంచాలు మోగిస్తే ఎలా

Leave A Reply

Your Email Id will not be published!