CM Dhami : అంకితా ఫ్యామిలీకి రూ. 25 లక్షల ఎక్స్ గ్రేషియా
ప్రకటించిన ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి
CM Dhami : ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి కీలక ప్రకటన చేసింది. భారతీయ జనతా పార్టీకి చెందిన మాజీ మంత్రి కుమారుడి వ్యవహారం చర్చకు దారితీసింది. 19 ఏళ్ల అంకితా భండారీ దారుణ హత్యకు గురయ్యారు. దేశ వ్యాప్తంగా సంచలనం కలిగించింది.
దీంతో అంకితా భండారీ కుటుంబానికి ప్రభుత్వం తరపున రూ. 25 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటంచారు సీఎం ధామి. బాధిత కుటుంబానికి సత్వర న్యాయం జరిగేలా విచారణను మరింత వేగవంతం చేయాలని ప్రభుత్వం కోర్టును కోరిందని చెప్పారు.
బుధవారం సీఎం(CM Dhami) కీలక ప్రకటన చేశారు. పౌరీ గర్వాల్ జిల్లాలోని శ్రీనగర్ లో అంకితా భండారీ అంత్యక్రియలు నిర్వహించారు. ఇదిలా ఉండగా తన కూతుర్ని తనకు చూపించకుండా దహనం చేశారంటూ తల్లి ఆరోపించింది.
ఘటనకు సంబంధించి బీజేపీ నాయకుడిని పార్టీ నుంచి బహిష్కరించారు. ఈ మేరకు సాయం ప్రకటించినట్లు తెలిపారు సీఎం. ఫాస్ట్ ట్రాక్ కోర్టులో కేసు విచారణ చేపట్టాలని సీఎం కోరారని సీఎం కేంద్ర కార్యాలయం వెల్లడించింది.
ఇదిలా ఉండగా సీఎం అంకిత భండారీ తండ్రితో మాట్లాడారు. కేసులో న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ ఘటనలో నేరస్థులకు ఉరి శిక్ష వేయాలని తండ్రి డిమాండ్ చేశారు .
బీజేపీ నాయకుడు వినోద్ ఆర్య కుమారుడు పుల్కిత్ ఆర్య యాజమాన్యంలోని రిసార్ట్ లోని భాగాలను రాత్రిపూట కూల్చి వేయడం ద్వారా హత్య కేసులో సాక్ష్యాలను నాశనం చేశారనే విమర్శల మధ్య ఈ పరిణామం చోటు చేసుకుంది.
Also Read : రూ. 565 కోట్ల చిట్ ఫంట్ కేసులో అరెస్ట్