Amrit Pal Singh Case : అమృత పాల్ సింగ్ పై మరో కేసు
అనుచరులపై కూడా నమోదు
Amrit Pal Singh Case : ఖలిస్తానీ వివాదాస్పద నాయకుడు అమృత పాల్ సింగ్ , అతడి అనుచరులపై కొత్తగా కేసు నమోదైంది. ఆయుధాల చట్టం లోని నిబంధనల ప్రకారం సింగ్ అనుచరులు ఏడుగురిని అరెస్ట్ చేసినట్లు అమృత్ సర్ రూరల్ సీనియర్ ఎస్పీ సతీందర్ సింగ్ వెల్లడించారు. అక్రమ ఆయుధాలు కలిగి ఉన్నారనే ఆరోపణలపై పరారీలో ఉన్న బోధకుడు అమృత పాల్ సింగ్(Amrit Pal Singh Case) , సహచరులపై తాజాగా ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు స్పష్టం చేశారు.
ఆయుధాల చట్టం కింద గత రాత్రి ఎఫ్ఐఆర్ నమోదు చేశామని తెలిపారు. ఇందులో అమృత పాల్ సింగ్ కీలక నిందితుడని స్పష్టం చేశారు. ఏడుగురిని కూడా చేర్చామన్నారు. ఎస్ఎస్పీ ఆదివారం సతీందర్ సింగ్ మీడియాతో మాట్లాడారు. ఈ మేరకు కేసుకు సంబంధించి కీలక వివరాలు వెల్లడించారు. ఇప్పటి వరకు 78 మంది సభ్యులను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. జలందర్ జిల్లాలో అమృత పాల్ సింగ్గ(Amrit Pal Singh) ను వెంబడించామని, కానీ కళ్లు కప్పి తప్పించు కున్నాడని చెప్పారు.
ఇప్పటి వరకు రాష్ట్ర పోలీసులతో పాటు కేంద్ర బలగాలు కూడా ప్రస్తుతం కొలువు తీరాయని తెలిపారు. ఆపరేషన్ ఇంకా కొనసాగుతోందన్నారు. ఫిబ్రవరి 23న జరిగిన ఆజ్నాలా ఘటనలో పోలీసులు గతంలో అమృతపాల్ తో పాటు అతడి సహచరులపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. జలంధర్ లోని మెహత్ పూర్ సమీపంలోని ప్రదేశంలో అమృత పాల్ కాన్వాయ్ లో భాగమైన ఏడుగురు సహచరులను అరెస్ట్ చేశామన్నారు సతీందర్ సింగ్. ప్రస్తుతం ఆపరేషన్ ఇంకా కొనసాగుతోందన్నారు ఎస్ఎస్పీ.
Also Read : ఆపరేషన్ కొనసాగుతోంది – సీపీ