Anuradha Paswan: రాజస్థాన్ పోలీసులకు చిక్కిన నిత్య పెళ్లికూతురు ! 26వ పెళ్లితో బట్టబయలైన వ్యవహారం !
రాజస్థాన్ పోలీసులకు చిక్కిన నిత్య పెళ్లికూతురు ! 26వ పెళ్లితో బట్టబయలైన వ్యవహారం !
Anuradha Paswan : పెళ్లి పేరుతో అమాయికుల్ని మోసం చేస్తున్న నిత్య పెళ్లి కూతుర్ని పోలీసులు అరెస్ట్ చేశారు. అత్తారింట్లో అమాయకురాలిగా నటిస్తూ వారి ఆస్తులు, నగదుకు సంబంధించిన రహస్యాలను తెలుసుకోవడం.. అందరి మెప్పు పొందాక తన గ్యాంగ్ సాయంతో నగదు, బంగారు ఆభరణాలతో ఉడాయించడం ఆమె అలావాటు. ఇలా ఆమె ఏడు నెలల్లో ఒకటి కాదు రెండు కాదు ఏకగా 25 పెళ్లిళ్లు చేసుకుని డబ్బు, బంగారంతో పరారయింది. ఈ నేపథ్యంలో పక్కా ప్రణాళికతో 26వ పెళ్లికి సిద్ధమైన ఆమెను రాజస్థాన్(Rajasthan) పోలీసులు అరెస్టు చేసారు. ఇక పూర్తి వివరాల్లోకి వెళితే…
Anuradha Paswan Case
రాజస్థాన్ కు చెందిన యువతి అనురాధా పాశ్వాన్(Anuradha Paswan) ది కడుపేదరికం, ఒంటరి జీవితం, నిరుద్యోగైన తమ్ముడు బాధ్యతను తానే చూసుకోవాలి. పెళ్లి చేసుకునేందుకు చేతిలో డబ్బు లేదు. దీనితో పేదరికం నుంచి బయటపడేందుకు కతర్నాక్ ప్లాన్ వేసింది. తనకున్న అందం, తెలివితేటలతో పెళ్లి పేరుతో వరుస మోసాలకు పాల్పడింది. తానొక ఒంటరి మహిళనని చెప్పుకొంటూ… తనకు ఉద్యోగం లేని ఒక సోదరుడు ఉన్నాడని నమ్మించేది. తాను పేదరాలినని, ఎవరి అండా లేకుండా జీవిస్తున్నానంటూ అందరినీ మభ్యపెట్టేది. తన గ్యాంగ్‌లోని ఒక వ్యక్తిని మధ్యవర్తిగా పంపుతూ పెళ్లి సంబంధాలు కుదుర్చుకునేది. కొత్త పేరు, ఊరు, గుర్తింపు కార్డులతో వివాహాలు చేసుకునేది. పెళ్లి అనంతరం అత్త వారింట్లో అమాయకురాలిగా నటిస్తూ వారి నుంచి ఆస్తులు, నగదు, ఆభరణాల రహస్యాలు తెలుసుకునేది. అదును చూసి ఇంట్లో వారందరికీ ఆహారంలో మత్తు మందు కలిపి ఇచ్చేది. అనంతరం గ్యాంగ్ సభ్యులతో కలిసి విలువైన వస్తువులు, నగదుతో పరారయ్యేది.
ఇందుకోసం తానే ఓ గ్యాంగ్‌ను నడుపుతోంది. అమాయకులు, పెళ్లి కుమార్తె కోసం అన్వేషిస్తున్న వారి ఇంటికి తన గ్యాంగ్ లోని మనిషిని పంపిస్తోంది. ఈ గ్యాంగ్ ఆమె ఫోటోలు, ప్రొఫైల్‌ను పెళ్లి కుమారులకు చూపిస్తారు. అనంతరం, పెళ్లికి ఒప్పిస్తారు. ఇందుకు గాను పెళ్లి కుమార్తెను చూసినందుకు పెళ్లి కుమారుడి కుటుంబం నుంచి రూ.2లక్షలు వసూలు చేస్తారు.
పెళ్లి తర్వాత
ప్లాన్ ప్రకారం… పెళ్లి చేసుకున్న మొదటి రోజు నుంచే అనురాధా పాశ్వాన్(Anuradha Paswan) అత్తింటి వారితో అనుకువగా మెసులుతుంది. ఇంట్లో ఉన్న బంగారాన్ని ఉడాయించాలనుకుంటే వెంటనే తన ప్లాన్ లో భాగంగా కట్టుకున్న భర్త, ఇతర కుటుంబసభ్యులు తినే ఆహారంలో మత్తు మందు కలుపుతుంది. మత్తు మందు కలిపిన ఆహారం తిన్న కుటుంబ సభ్యులు ఆపస్మారక స్థితిలోకి జారుకున్న తర్వాత బంగారం, నగదు, ఇతర విలువైన వస్తువులను కాజేస్తుంది. ఇప్పటివరకు 25 మందిని బురిడీ కొట్టించింది. ఈ క్రమంలో అనురాధా పాశ్వాన్ చేతిలో మోసపోయిన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈమె గురించి తెలుసుకున్న మాధోపుర్ పోలీసులు… అదే తరహాలో పాసవాన్‌ను బురిడీ కొట్టించి భోపాల్‌లో అదుపులోకి తీసుకున్నారు. నిత్యపెళ్లి కుమార్తెను, ఆమె ముఠా గుట్టురట్టు చేశారు. కేసు నమోదు చేసుకున్న మాధోపుర్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Also Read : YouTuber Jyoti Malhotra: ఎన్ఐఏ చేతిలో యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా పాక్ టూర్ డైరీ