Anurag Thakur : కాషాయానికి ఢోకా లేదు – ఠాకూర్
మళ్లీ దేశానికి ప్రధానిగా మోదీనే
Anurag Thakur : కేంద్ర క్రీడా, సమాచార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాబోయే 2024లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో మరోసారి కాషాయ జెండా ఎగరడం ఖాయమని జోష్యం చెప్పారు. గతంలో గెలిచిన సీట్ల కంటే ఇంకొన్ని సీట్లు గెలుస్తామని స్పష్టం చేశారు. ఎవరు ఎన్ని రకాలుగా అబద్దాలు ప్రచారం చేసినా ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు. ఇవాళ యావత్ ప్రపంచం భారత దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పాలనా శైలిని, సమర్థతను, నాయకత్వాన్ని ప్రశంసిస్తున్నారని చెప్పారు.
మోదీ ఉక్కు సంకల్పం కలిగిన నాయకుడని కొనియాడారు. ఆయన నేతృత్యవంలో ని బీజేపీ సంకీర్ణ సర్కార్ ఆశించిన దానికంటే అభివృద్ది సాధించిందన్నారు. ఇవాళ డిజిటలైజేషన్ వాడకంలో ప్రపంచంలోనే భారత్ నెంబర్ 1గా ఉందని చెప్పారు అనురాగ్ ఠాకూర్(Anurag Thakur). మోదీ ప్రభుత్వం ఏర్పడి 9 ఏళ్లు అయిన సందర్భంగా సాధించిన ప్రగతిని ఈ సందర్భంగా వివరించారు మంత్రి.
సుపరిపాలన, పేదల సంక్షేమం సాధారణ ప్రజలను తీవ్రంగా ప్రభావితం చేశాయన్నారు. హర్యానా లోని కర్నాల్ లోక్ సభ నియోజకవర్గంలోని పానిపట్ లో శనివారం జరిగిన గ్లోరియస్ ఇండియా ఈవెంట్ లో అనురాగ్ ఠకూర్ పాల్గొని ప్రసంగించారు. ఈ భారీ జన సందోహం చూస్తుంటే ఇక మూడోసారి తాము అధికారంలోకి వస్తామని తేలి పోయిందన్నారు క్రీడా శాఖ మంత్రి.
Also Read : Mallikarjun Kharge : ఇకనైనా మోదీ మేల్కొంటే బెటర్
