Anurag Thakur : గ్యాంగ్ స్టర్లపై ఎందుకంత ప్రేమ
నిప్పులు చెరిగిన అనురాగ్ ఠాకూర్
Anurag Thakur : కేంద్ర సమాచార, క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్(Anurag Thakur) నిప్పులు చెరిగారు. యూపీలో గ్యాంగ్ స్టర్లు అతిక్ అహ్మద్ , సోదరుడు అశ్రఫ్ అహ్మద్ లు ప్రయాగ్ రాజ్ లో షూటర్ల చేతుల్లో కాల్పులకు గురయ్యారు. ఈ ఘటనపై బీఎస్పీ చీఫ్ మాయావతి, ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ , ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ సీరియస్ గా స్పందించారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటారా అని ప్రశ్నించారు. బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ సైతం సంచలన వ్యాఖ్యలు చేశారు. వారంతా యూపీ సీఎం యోగి ఆదిత్యా నాథ్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పక్కదారి పట్టిందని , నేరస్థులను కంట్రోల్ చేయలని యోగి రేపు ప్రజలకు ఎలా సెక్యూరిటీ కల్పిస్తారంటూ ప్రశ్నించారు. వీరి కామెంట్స్ పై సీరియస్ గా స్పందించారు కేంద్ర మంత్రి. గ్యాంగ్ స్టర్లు తాము చేసిన నేరాల కారణంగానే హత్యకు గురయ్యారని పేర్కొన్నారు.
నేరస్థులను ఖండించాల్సిన పార్టీలు, నేతలు వారికి ఎలా వత్తాసు పలుకుతారంటూ నిలదీశారు అనురాగ్ ఠాకూర్. ఈ మాఫియా డాన్లు సామాన్య ప్రజలపై దాడి చేశారు. చంపారు. వేల కోట్లు దోచుకున్నారు. రాష్ట్రాన్ని నేరమయంగా మార్చారు. వీరికి ఎస్పీ, బీఎస్పీ మద్దతు తెలిపాయని ఆరోపించారు కేంద్ర మంత్రి.
Also Read : గ్యాంగ్ స్టర్ల హత్యపై విచారణకు ఓకే