Anurag Thakur : ప్రతిపక్షం అవమానం ఠాకూర్ ఆగ్రహం
నిప్పులు చెరిగిన కేంద్ర మంత్రి
Anurag Thakur : కేంద్ర క్రీడా, సమాచార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ప్రతిపక్షాలు పదే పదే రాష్ట్రపతి ద్రౌపది ముర్మును టార్గెట్ చేశాయంటూ మండిపడ్డారు. ఇది ఎంత మాత్రం మంచి పద్దతి కాదన్నారు. అర్ధవంతమైన చర్చలకు ఆస్కారం లేకుండా పోయిందని అన్నారు.
తాము ప్రతి అంశంపై చర్చించేందుకు సిద్దంగా ఉన్నామని స్పష్టం చేశారు. కానీ విపక్షాలే ఒప్పు కోవడం లేదని ఆరోపించారు . శనివారం కేంద్ర మంత్రి మీడియాతో మాట్లాడారు. గతంలో పాలకులు ప్రజలను , అభివృద్దిని పట్టించు కోలేదన్నారు. కానీ తాము మాత్రం అన్ని రంగాలను బలోపేతం చేసేందుకు ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు అనురాగ్ ఠాకూర్(Anurag Thakur).
దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రపతిని ప్రతిపక్షాలు పదే పదే అవమానానికి గురి చేస్తున్నాయంటూ ఆవేదన వ్యక్తం చేశారు. పార్లమెంట్ లో బడ్జెట్ సమావేశానికి ముందు రాష్ట్రపతి ప్రసంగంపై వారి ప్రతిస్పందనను ఖండించారు అనురాగ్ ఠాకూర్. ప్రతిపక్షం రాష్ట్రపతిని పదే పదే అవమానిస్తోంది.
వారు ఆమె పట్ల ప్రదర్శిస్తున్న వైఖరి దారుణంగా ఉందన్నారు. ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఎంపీలు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. దేశంలోని అన్ని వర్గాలకు బడ్జెట్ లో అన్ని వర్గాలకు ఏదో ఒక బడ్జెట్‌ను అందజేస్తున్నందున ప్రతిపక్షాలు బడ్జెట్‌పై చర్చించలేకపోతున్నాయని ఆయన అన్నారు.
బడ్జెట్ గురించి చర్చించకుండా వారంతా ద్రౌపది ముర్ముపై నిందలు వేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు అనురాగ్ ఠాకూర్(Anurag Thakur). ఎల్ఐసీ, ఎస్బీఐ సంస్థలకు చెందిన డబ్బులు అదానీ గ్రూప్ లో పెట్టిన దానిపై చర్చకు కూడా అనుమతి ఇచ్చామన్నారు.
Also Read : ప్రతి ఒక్కరితో కేంద్రం పేచీ – కేజ్రీవాల్