Ashok Gehlot : ఎవ‌రైనా పార్టీకి క‌ట్టుబడి ఉండాల్సిందే

స్ప‌ష్టం చేసిన సీఎం అశోక్ గెహ్లాట్

Ashok Gehlot :  రాజ‌స్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఎవ‌రైనా ఎంత‌టి వారైనా స‌రే పార్టీకి క‌ట్టుబ‌డి ఉండాల్సిందేన‌ని స్ప‌ష్టం చేశారు. రాజ‌స్థాన్ రాష్ట్రంలో చోటు చేసుకున్న సంక్షోభం గురించి కామెంట్స్ చేశారు. ఆయ‌న ఏఐసీసీ తాత్కాలిక చీఫ్ సోనియా గాంధీతో భేటీ అయ్యారు. అంతుకు ముందు మీడియాతో అశోక్ గెహ్లాట్(Ashok Gehlot) మాట్లాడారు.

రాజ‌కీయాల‌లో సంక్షోభాలు నెల‌కొన‌డం స‌ర్వ సాధార‌ణ‌మైన విష‌య‌మ‌ని పేర్కొన్నారు. 90 మంది ఎమ్మెల్యేలు మీకు మ‌ద్ద‌తుగా ఉన్నార‌ని ఇది తిరుగుబాటు కాదా అన్న ప్ర‌శ్న‌కు తెలివిగా జ‌వాబు ఇచ్చారు సీఎం. ఎన్నో ఏళ్ల పాటు రాజ‌కీయాల్లో ఉన్నా. ఎంద‌రికో లైఫ్ ఇచ్చా. చాలా మంది పార్టీకి సంబంధించినంత వ‌ర‌కు బాధ్య‌త వ‌హించాల్సి ఉంటుంది.

ఈ విష‌యంలో ఎమ్మెల్యేలు త‌న ప‌ట్ల ప్రేమ‌, అభిమానం క‌లిగి ఉండ‌డం స‌ర్వ సాధార‌ణ‌మైన విష‌య‌మ‌ని పేర్కొన్నారు సీఎం. ఇందులో ఎలాంటి అనుమానం అక్క‌ర్లేద‌న్నారు. కాగా ప‌రిశీల‌కుల‌ను క‌లిసేందుకు ఎమ్మెల్యేలు ఒప్పుకోక పోవ‌డాన్ని లైట్ గా తీసుకున్నారు అశోక్ గెహ్లాట్(Ashok Gehlot). త్వ‌ర‌లోనే సంక్షోభానికి ప‌రిష్కారం ల‌భిస్తుంద‌ని ఆశాభావం వ్య‌క్తం చేశారు.

ఈ అంశాన్ని ఆయ‌న ఘ‌ర్ కీ బాత్ గా పేర్కొన్నారు. ఇది అంత‌ర్గ‌త కుటుంబానికి సంబంధించిన అంశ‌మ‌న్నారు. మిగ‌తా పార్టీల‌కంటే కాంగ్రెస్ పార్టీలోనే స్వేచ్ఛ‌, ప్రజాస్వామ్యం ఎక్కువ‌గా ఉంద‌న్నారు. ఇందులో ఎలాంటి అనుమానం లేద‌న్నారు. తాను ఇప్ప‌టి వ‌ర‌కు పార్టీని ధిక్క‌రించిన దాఖ‌లాలు లేవ‌న్నారు. ప‌రిశీల‌కులు అజ‌య్ మాకెన్, మ‌ల్లికార్జున్ ఖ‌ర్గే తిరుగుబాటు ఎమ్మెల్యేల‌పై హైక‌మాండ్ కు ఫిర్యాదు చేశారు.

Also Read : కాంగ్రెస్ అధ్య‌క్ష ప‌ద‌వి రేసులో డిగ్గీ రాజా

Leave A Reply

Your Email Id will not be published!