AP ACB Court : లోకేష్ కు ఏసీబీ కోర్టు షాక్
నోటీసులు జారీ చేసేందుకు అనుమతి
AP ACB Court : విజయవాడ – తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కు కోలుకోలేని షాక్ తగిలింది. ఏసీబీ కోర్టు(ACB Court) సంచలన తీర్పు వెలువరించింది. ఫైబర్ నెట్ , అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు స్కామ్ కేసుకు సంబంధించి విచారణ చేపట్టేందుకు అనుమతి ఇవ్వాలని కోరింది ఏపీ సీఐడీ.
AP ACB Court Notice given to Nara Lokesh
గురువారం ఏసీబీ కోర్టులో విచారణ చేపట్టింది. లోకేష్ బాబును అరెస్ట్ చేసేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ సీఐడీ పిటిషన్ దాఖలు చేసింది. ఇదిలా ఉండగా ఇటీవల ఏపీలో యువ గళం పాదయాత్ర చేపట్టిన సందర్భంగా సంచలన కామెంట్స్ చేశారు. రెడ్ బుక్ పేరుతో దర్యాప్తు అధికారులను టార్గెట్ చేయడం, బెదిరింపులకు పాల్పడేలా వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా పరిగణించింది ఏపీ దర్యాప్తు సంస్థ.
కేసులకు సంబంధించి బాధ్యతతో వ్యవహరించాల్సిన టీడీపీ నేత ఇలా వ్యక్తిగతంగా దూషణలకు దిగడం
మంచి పద్దతి కాదని అభిప్రాయపడింది ఏసీబీ కోర్టు. తదుపరి విచారణ జనవరి 9కి వాయిదా వేస్తూ తీర్పు చెప్పింది ఏసీబీ కోర్టు. లుక్ అవుట్ నోటీసులు ఇచ్చేందుకు పర్మిషన్ ఇచ్చింది కోర్టు. దీంతో పునరాలోచనలో పడింది తెలుగుదేశం పార్టీ.
Also Read : Tirumala Rush : శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.91 కోట్లు