AP ACB Court Slams : బాబు లాయర్లపై ఏసీబీ కోర్టు ఫైర్
ప్రొసీజర్స్ తెలుసుకోక పోతే ఎలా
AP ACB Court Slams : విజయవాడ – ఏసీబీ కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. టీడీపీ చీఫ్, మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడుకు సంబంధించిన కేసులో వాదిస్తున్న లాయర్లపై మండిపడింది. కోర్టు ప్రొసీజర్ ఫాలో కావడం లేదని పేర్కొంది. పిటిషన్ వేయాలని అనుకుంటే మధ్యాహ్నం 12 గంటల లోపు వేయాలని ఆ విషయం తెలుసు కోకుండా ఇలా ఒత్తిడి చేయడం ఏమిటంటూ ఏసీబీ కోర్టు న్యాయమూర్తి ఫైర్ అయ్యారు. అంతే కాకుండా బెంచ్ పైకి రావాలని అనుకుంటే ముందుగా కేటాయించిన నంబర్ ను ఇవ్వాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.
AP ACB Court Slams to Chandrababu Advoctes
ఒక కేసులో ఆర్డర్స్ ఇచ్చే సమయానికి ఇంకో పిటిషన్ వస్తే ఎలా , ఇతర పెండింగ్ కేసులు ఎప్పుడు చూడలి అంటూ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) ప్రస్తుతం జైల్లో ఉన్నారు. ఆయనకు జడ్జి హిమ బిందు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది.
దీనిని సవాల్ చేస్తూ చంద్రబాబు నాయుడు తరపు లాయర్లు సిద్దార్థ్ లూథ్రా, వెంకటేశ్వర్ రావు పిటిషన్ దాఖలు చేశారు. ఆయనకు ప్రాణ హానీ ఉందని , అందుకే గృహ నిర్బంధం విధించాలని కోరారు. దీనిపై జడ్జి తీవ్రంగా స్పందించారు. చట్టం ముందు అంతా సమానమేనని, మాజీ సీఎం అని ప్రత్యేకతలు ఏవీ ఉండవని స్పష్టం చేశారు. ప్రస్తుతం జడ్జి చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి.
Also Read : PV Ramesh : మాజీ ఐఏఎస్ పీవీ రమేష్ పై వేటు