AP Annamayya Dist : ఏపీ అన్నమయ్య జిల్లాలో 30 ఏళ్ల వేప చెట్టు నుంచి అద్భుత దృశ్యం
ఈ వింత ఘటన ఎర్రామ్ రాజ్‌గారి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల సమీపంలో చోటుచేసుకుంది
AP Annamayya Dist : అన్నమయ్య జిల్లా వీరబల్లి(Veeraballi) మండలంలో వింత ఘటన చోటుచేసుకుంది. వేప చెట్టు నుంచి పాలు వస్తున్నాయి, ఈ వింతను చూడటానికి ప్రజలు తండోపతండాలుగా వస్తున్నారు. స్థానిక మహిళలు వేప చెట్టును ఒక రకమైన దేవతగా భావిస్తారు. వేపచెట్టు నుంచి వచ్చే పాలు అమ్మవారి మహిమ అని నమ్ముతున్నారు. ఈ ప్రాంత ప్రజలు ఒక వేప చెట్టుఒక దగ్గరనుంచి కాకుండా అనేక రకాల దగ్గర నుంచి
పాలు రావడం చాలా అదృష్టమని స్థానిక మహిళలు అంటున్నారు. అన్నమయ్య జిల్లా వీరబల్లి మండలం ఓదివీడు వద్ద వేప చెట్టు నుంచి పాలు కారడం చర్చనీయాంశంగా మారింది.
AP Annamayya Dist Viral
ఈ వింత ఘటన ఎర్రామ్ రాజ్‌గారి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల సమీపంలో చోటుచేసుకుంది. 30 ఏళ్ల వేప చెట్టు పాలు కారుతుంది. ఇది చూసి ఇరుగుపొరుగు వారికి సమాచారం అందించగా వారు విచిత్రంగా స్పందించారు. ఈ విషయం తెలుసుకున్న చుట్టుపక్కల గ్రామాల వారు చూసేందుకు చాలా మంది వచ్చారు. తమ గ్రామంలో ఇంతటి వింతను ఎన్నడూ చూడలేదని చుట్టుపక్కల ప్రజలు చెబుతున్నారు.
వేప చెట్టు నుంచి పాలలాంటి ద్రవం రావడంతో స్థానికులు ఆశ్చర్యపోయారు. పాలేనా? లేదంటే… మరో జిగట పదార్థమా అని గ్రామస్తులు చెబుతున్నారు. ఈ వింతను చూసేందుకు గ్రామస్తులతో పాటు పరిసర ప్రాంతాల ప్రజలు కూడా బారులు తీరుతున్నారు.
Also Read : IND vs ENG 1st Test : దుమారం రేపుతున్న కెప్టెన్ రోహిత్ శర్మ వ్యాఖ్యలు