KTR Sensational Comments: సీఎం రేవంత్‌ రెడ్డిపై కేటీఆర్‌ సంచలన వ్యాఖ్యలు !

సీఎం రేవంత్‌ రెడ్డిపై కేటీఆర్‌ సంచలన వ్యాఖ్యలు !

KTR Sensational Comments: తెలంగాణా సీఎం రేవంత్ రెడ్డిపై… మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌(KTR) సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి… తెలంగాణ ఏక్‌నాథ్‌ షిండే అవ్వొచ్చని కాబట్టి తెలంగాణలోని మైనార్టీలు జాగ్రత్తగా ఉండాలన్నారు. బీజేపీ-కాంగ్రెస్‌ ఒప్పందంలో భాగంగానే ఎమ్మెల్సీ ఎన్నికలకు వేర్వేరు నోటిఫికేషన్లు వచ్చాయని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్‌ వైపు చూసే మైనార్టీలు ఒక్కసారి ఆలోచించాలన్నారు. బీజేపీని ఓడించేది బీఆర్‌ఎస్‌ మాత్రమేనని ఆయన స్పష్టం చేసారు. కరీంనగర్ లో బుధవారం నిర్వహించిన కరీంనగర్ పార్లమెంటరీ సోషల్ మీడియా వారియర్స్ మీటింగ్‌ లో పాల్గొన్న కేటీఆర్… అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు, పార్లమెంట్ ఎన్నికల సన్నద్ధంపై శ్రేణులకు దిశా నిర్ధేశం చేసారు.

KTR Sensational Comments Viral

ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ… ఉమ్మడి కరీంనగర్ జిల్లాతో పాటు, చాలా చోట్ల బీఆర్ఎస్‌పై గెలిచిన ఎమ్మెల్యేలంతా కేవలం నాలుగైదుసార్లు ఓడిపోయిన సానుభూతితో మాత్రమే గెల్చారని అన్నారు. గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు తగిలింది చాలా చిన్న దెబ్బ మాత్రమేనని, అయినా ప్రజలు 39 మంది ఎమ్మెల్యేలను గెలిపించారని గుర్తుచేశారు. చాలా స్వల్ప మెజార్టీతో 14 స్థానాలను కోల్పోయామని అన్నారు. కార్యకర్తలు ఢీలా పడిపోవాల్సిన అవసరం లేదని ధైర్యం చెప్పారు. గతంలో కరీంనగర్ పార్లమెంట్‌లో కేసీఆర్‌ను భారీ మెజార్టీతో గెలిపించి ఢిల్లీకి పంపిన చరిత్ర ఇక్కడి ఓటర్లదని తెలిపారు. తెలంగాణా ఉద్యమానికి ఊపిరులూదిన గడ్డ కరీంనగర్ అని చెప్పారు.

ఎన్నికలకు ముందు సీఎం రేవంత్‌ రెడ్డి పెద్ద పెద్ద మాటలు చెప్పారని… ఇవాళ పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. కరెంట్ బిల్లులు కట్టొద్దని సోనియా కడుతుందని రేవంతే అన్నారని గుర్తు చేసారు. వంద అబద్ధాలు చెప్పైనా ఒక్క పెళ్లి చేయాలంటారు… అలా అబద్ధాలను నమ్ముకునే రేవంత్ సీఎం, కేంద్రంలో మోడీ ప్రధాని అయ్యారని ఎద్దేవా చేశారు. వాళ్లవన్నీ 420 హామీలని మండిపడ్డారు. ముఖ్యమంత్రి పదవి చేసేందుకు అనుభవముందా అని అడిగితే రేవంతేమన్నాడు ? అదేం ఉంది అన్నారు. ఇప్పుడు తెలుస్తోంది అనుభవం ఎంత అవసరమో ? అని కేటీఆర్‌ మండిపడ్డారు.

Also Read : AP Annamayya Dist : ఏపీ అన్నమయ్య జిల్లాలో 30 ఏళ్ల వేప చెట్టు నుంచి అద్భుత దృశ్యం

Leave A Reply

Your Email Id will not be published!