AP Assembly: మంత్రులనే మాయచేసేలా కొందరు అధికారుల తీరంటూ పవన్ ఫైర్ !
మంత్రులనే మాయచేసేలా కొందరు అధికారుల తీరంటూ పవన్ ఫైర్ !
AP Assembly: మంత్రులను మాయచేసేలా కొందరు అధికారులు సమాచారం ఇస్తున్నారని అసెంబ్లీ(AP Assembly) లాబీలో చర్చ జరిగింది. దీనిపై డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్, మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి మధ్య జరిగిన సంభాషణలో పలు విషయాలు చర్చకు వచ్చాయి. గత ప్రభుత్వానికి సంబంధించి సభ్యులు అడిగే ప్రశ్నలకు సరైన సమాధానాలు ఇవ్వడం లేదంటూ అధికారులపై పవన్ కల్యాణ్, డోలా బాలవీరాంజయనేయ స్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు.
AP Assembly…
శాసనసభ మూడోరోజు పాటు జరిగిన సమావేశాల్లో భాగంగా స్పీకర్ అయ్యన్నపాత్రుడు ప్రశ్నోత్తరాలు చేపట్టారు. కొందరు సభ్యులు అడిగిన ప్రశ్నలకు అధికారుల ఒక్కరు ఐన సరైన సమాచారం ఇవ్వలేదు. గ్రామ పంచాయతీల నిధుల మళ్లింపు విషయంలో అధికారులు ఇచ్చిన సమాచారంపై పవన్ కల్యాణ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. వివరాల్లేకుండా ‘అవును.. కాదు.. ఉత్పన్నం కాదు’ అని తప్పించుకొనే రీతిలో అధికారులు సమాధానం ఇవ్వడంపై ఆయన అభ్యంతరం తెలిపారు. పొడిపొడిగానే చెప్పాలనే నిబంధన ఏమైనా ఉందా అని ప్రశ్నించారు. ఇక నుంచి అనుబంధ పత్రాల్లో కాకుండా సభ్యులకు ఇచ్చే సమాధానంలోనే వివరాలు ఉండేలా చూడాలని డిప్యూటీ సీఎం ఆదేశించారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధుల మళ్లింపు విషయంలో అధికారుల సమాధానంపై డోలా బాలవీరాంజయనేయ స్వామి అసంతృప్తి వ్యక్తం చేశారు. అవకతవకలపై సరైన సమాచారం ఇవ్వలేదన్నారు. పూర్తిస్థాయిలో వివరాలు అందజేయాలని ఆదేశించారు.
Also Read : Puja Khedkar Controversy: ట్రైనీ పూజా ఖేడ్కర్ తల్లిదండ్రుల ‘వైవాహిక స్థితి’ వివరాలు కోరిన కేంద్రం..!