AP Cabinet: 33 అంశాలకు ఏపీ కేబినెట్ ఆమోదం

33 అంశాలకు ఏపీ కేబినెట్ ఆమోదం

AP Cabinet : ఆంధ్రప్రదేశ్‌ సచివాలయంలో నిర్వహించిన మంత్రివర్గ (AP Cabinet) సమావేశంలో మొత్తం 33 అజెండా అంశాలకు ఆమోదం లభించింది. 51వ సీఆర్‌డీఏ సమావేశం ప్రతిపాదనలకు మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. రాజధాని పరిధి 29 గ్రామాల్లో రూ.904 కోట్లతో మౌలిక వసతుల కల్పనకు పచ్చజెండా ఊపింది. ఏపీ సర్క్యులర్‌ ఎకానమీ, వేస్ట్‌ రీస్లైకింగ్‌ పాలసీ (4.0) 2025-30కి ఆమోదం తెలిపింది.

పర్యాటక ప్రాజెక్టులకు ప్రభుత్వ భూముల కేటాయింపు మార్గదర్శకాలకు ఆమోద ముద్ర వేసింది. సీఆర్‌డీఏ పరిధిలో వివిధ సంస్థలకు భూ కేటాయింపులపై మంత్రివర్గ ఉపసంఘం సిఫార్సులకు మంత్రివర్గం (AP Cabinet) ఆమోదం తెలిపింది. గ్రామ, వార్డు సచివాలయాల్లో డిప్యూటేషన్‌, ఔట్‌సోర్సింగ్‌ ప్రాతిపదికన 2,778 పోస్టుల భర్తీకి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. అధికారిక భాష కమిషన్‌ పేరును ‘మండలి వెంకట కృష్ణారావు అధికారిక భాష కమిషన్‌’గా మార్పునకు ఆమోదం తెలిపింది.

AP Cabinet – కేబినెట్ లోఆమోదించిన పలు అంశాలు

తోట వెంకటాచలం (కాకినాడ) లిఫ్ట్‌ ఇరిగేషన్ కాలువ అభివృద్ధి పనులకు ఆమోదం
పంచాయతీరాజ్‌ చట్టంలోని పలు సెక్షన్ల చట్ట సవరణకు ఆమోదం
కడప మైలవరంలో 250 మెగా వాట్ల సోలార్ పవర్ ప్రాజెక్టు ఏర్పాటుకు ఆమోదం
ఆదానీ సోలార్ ఎనర్జీకి 200.05 ఎకరాలు కేటాయింపునకు ఆమోదం
గుంటూరు తెదేపా కార్యాలయ భూమి లీజు కాలపరిమితి పెంపునకు ఆమోదం
చిత్తూరు సీహెచ్‌సీని 100 పడకల ఆసుపత్రిగా అభివృద్ధి, 56 కొత్త పోస్టుల మంజూరు ప్రతిపాదనలకు ఆమోదం
నాలా పన్ను 4 శాతంలో 70 శాతం స్థానిక సంస్థలకు, 30 శాతం అథారిటీలకు ఇవ్వాలని ఆదేశాలు
ఏపీ యాచక నిరోధక చట్టసవరణ ముసాయిదా బిల్లుకు ఆమోదం
మద్యం ప్రాథమిక ధరలు, విదేశీ మద్యం బ్రాండ్‌లకు టెండర్ కమిటీ సిఫార్సులకు ఆమోదం

ఏపీ రెవెన్యూ శాఖకు స్కోచ్‌ అవార్డులు

ఆంధ్రప్రదేశ్‌ రెవెన్యూశాఖకు జాతీయ స్థాయిలో ప్రతిష్ఠాత్మక అవార్డులు వరించాయి. 2025 ఏడాదికిగాను రాష్ట్ర రెవెన్యూ శాఖకు రెండు స్కోచ్‌లు అవార్డులు వచ్చాయి. ఆన్‌లైన కోర్ట్‌ మేనేజ్‌మెంట్ సిస్టమ్, రీసర్వే 2.0కు స్కోచ్ అవార్డులు దక్కాయి. ప్రజలకు మెరుగైన సేవలు అందించినందుకు రెవెన్యూ శాఖకు వచ్చినట్లు మంత్రి అనగాని సత్య ప్రసాద్ వెల్లడించారు. విప్లవాత్మక సంస్కరణలకు అవార్డులు వరించినట్లు తెలిపారు. రెవెన్యూ ఉద్యోగుల కృషి కారణంగానే అవార్డులు వచ్చాయని అభినందించారు. వచ్చే నెల 20న దిల్లీలో స్కోచ్‌ అవార్డుల ప్రదానోత్సవం జరగనుంది.

Also Read : CM Chandrababu: ఎమ్మెల్యేలపై సీఎం చంద్రబాబు ఫైర్ ?

Leave A Reply

Your Email Id will not be published!