AP CID Chief AAG : ఏపీ సీఐడీ..ఏఏజీపై విచారణ వాయిదా
చర్యలు తీసుకోవాలంటూ దావా
AP CID Chief AAG : అమరావతి – ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వీ సీఐడీ సంజయ్(AP CID), అదనపు అడ్వొకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డిపై హైకోర్టులో పిటిషన్ దాఖలు అయ్యింది. ఏపీ స్కిల్ స్కాం కేసు విచారణలో ఉందని, కానీ పూర్తి నివేదిక రాకుండానే ఈ కేసుకు సంబంధించి అత్యుత్సాహంతో వివరాలను బయట పెట్టారంటూ ఆరోపిస్తూ పిటిషన్ దాఖాలైంది. ఏపీకి చెందిన స్వచ్చంధ సంస్థ నిర్వాహకుడు సత్యనారాయణ ఈ దావా వారిద్దరిపై వేశారు.
AP CID Chief AAG’s case adjourned
కేసు విచారణ ఉన్న సమయంలో ఎలాంటి ప్రెస్ మీట్స్ పెట్టడం కానీ, మీడియాతో మాట్లాడటం కానీ చేయకూడదంటూ పేర్కొన్నారు. ఈ విషయం తాను చెప్పడం లేదని , ఇప్పటికే పలు కేసుల విషయంలో ఉన్నత న్యాయ స్థానం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిందని ఈ సందర్భంగా పిటిషన్ లో పేర్కొన్నారు పిటిషన్ దారు.
ఈ ఇద్దరికీ ప్రభుత్వం జీత భత్యాలు చెల్లిస్తోందని, కానీ విలువైన సమయాన్ని, ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేశారని ఆరోపించారు సత్యనారాయణ. పిటిషన్ దాఱు తరపు న్యాయవాది బుధవారం జరిగిన విచారణ సందర్భంగా వాదనలు వినిపించారు.
కోర్టు అనుమతితో మరోసారి ఆర్టీఐ ద్వారా వివరాలు అడగాలని కోరారు. వాదోప వాదనలు విన్న ధర్మాసనం విచారణను వచ్చే వారానికి వాయిదా వేస్తున్నట్లు స్పష్టం చేసింది.
Also Read : AP CM YS Jagan : అమరజీవి త్యాగం చిరస్మరణీయం