AP CID Counter : పీవీ ర‌మేష్ కామెంట్స్ సీఐడీ సీరియ‌స్

ఆయ‌న స్టేట్ మెంట్ తో కేసు న‌డ‌వ‌లేదు

AP CID Counter : తాడేప‌ల్లిగూడెం – ఏపీ సీఐడీ షాకింగ్ కామెంట్స్ చేసింది. ఏపీ స్కిల్ డెవ‌ల‌ప్మెంట్ కార్పొరేష‌న్ స్కీం స్కామ్ కేసుకు సంబంధించి ఎక్కువ‌గా పేరు వ‌చ్చింది మాజీ ఐఏఎస్ ఆఫీస‌ర్ పీవీ ర‌మేష్ చేసిన కామెంట్స్ పై స్పందించింది. ఆయ‌న ఇచ్చిన ఒక్క స్టేట్మెంట్ తో కేసు మొత్తం న‌డ‌వ‌లేద‌ని పేర్కొంది.

AP CID Counter Viral

ద‌ర్యాప్తులో భాగంగా ఆయ‌న ఇచ్చిన వాంగ్మూలం ఒక్కటి మాత్ర‌మేన‌ని మిగ‌తా ప‌లు కోణాల‌లో ద‌ర్యాప్తు చేయ‌డం జ‌రిగింద‌ని స్ప‌ష్టం చేసింది ఏపీ సీఐడీ. అధికార దుర్వినియోగం స‌హా నిధుల మ‌ళ్లింపున‌కు సంబంధించి ప‌క్కా ఆధారాలు ఉన్నాయ‌ని తెలిపింది.

ఒక్క‌రితో ఈ కేసును ముందుకు తీసుకు వెళ్ల‌లేద‌ని వెల్ల‌డించింది. ఈ స్కీం స్కామ్ కేసు కోర్టు ప‌రిధిలో ఉంద‌ని, ఈ స‌మయంలో పీవీ ర‌మేష్(PV Ramesh) కామెంట్స్ చేయ‌డం భావ్యం కాద‌ని తెలిపింది. ఇలాంటి వ్యాఖ్య‌లు అయోమ‌యానికి గురి చేసేలా ఉన్నాయ‌ని పేర్కొంది.

ఇది ద‌ర్యాప్తును, విచార‌ణ‌ను ప్ర‌భావితం చేయ‌డ‌మే అవుతుంద‌ని అభిప్రాయ‌ప‌డింది ఏపీ సీఐడీ. నిధుల విడుద‌ల‌లో త‌న దిగువ స్థాయి అధికారి చేసిన సూచ‌న‌ను పీవీ ర‌మేష్ ప‌ట్టించు కోలేద‌ని ఆరోపించింది. రూ. 371 కోట్లు విడుద‌ల చేసే ముందు అంత మొత్తం ఒకేసారి రిలీజ్ చేయ‌డం క‌రెక్ట్ కాద‌ని ఆమె వారించిన‌ట్లు కూడా బ‌హిర్గ‌తం చేసింది.

Also Read : Tirumala Rush : శ్రీ‌వారి హుండీ ఆదాయం రూ. 4.17 కోట్లు

Leave A Reply

Your Email Id will not be published!