Nara Lokesh Notice : లోకేష్ కు షాక్ సీఐడీ నోటీస్

అమ‌రావ‌తి ఇన్న‌ర్ రింగ్ రోడ్డు

Nara Lokesh Notice  : వెల‌గ‌పూడి – తెలుగుదేశం పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ కు బిగ్ షాక్ త‌గిలింది. ఇప్ప‌టికే అమ‌రావ‌తి ఇన్న‌ర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ స్కాం కేసుకు సంబంధించి ఎ14గా చేర్చింది. తాజాగా నారా లోకేష్ కు నోటీసులు ఇచ్చేందుకు నిర్ణ‌యించింది. ఈ మేర‌కు ఏపీ సీఐడీ పోలీసులు ఢిల్లీలో త‌ప్పించుకు తిరుగుతున్న నారా లోకేష్ కు నోటీసులు ఇవ్వ‌డానికి బ‌య‌లు దేరి వెళ్లారు.

Nara Lokesh Notice From CID

మ‌రో వైపు త‌న‌కు ముంద‌స్తు బెయిల్ ఇవ్వాల‌ని కోరుతూ ఏపీ హైకోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేశారు నారా లోకేష్(Nara Lokesh). శుక్ర‌వారం ఈ పిటిష‌న్ పై విచార‌ణ చేప‌ట్టింది కోర్టు. అమరావతి ఇన్నర్‌ రింగ్ రోడ్డు ఎలైన్‌మెంట్‌ వ్యవహారంపై గత ఏడాది నమోదుచేసిన కేసులో ఏ14గా ఆయన పేరును సీఐడీ ఇటీవల చేర్చింది.

ఈ నేపథ్యంలో హైకోర్టులో లోకేశ్‌ దాఖలు చేసిన ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై ఉన్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపించారు. ఈ కేసులో లోకేశ్‌కు 41ఏ నోటీసులు ఇస్తామని, దానికి సంబంధించిన నిబంధనలు పాటిస్తామని కోర్టుకు తెలిపారు.

41ఏ నోటీసులు అంటే అరెస్ట్‌ ప్రస్తావన రానందున.. ముందస్తు బెయిల్‌పై విచారణను ముగిస్తున్నట్లు న్యాయమూర్తి స్ప‌ష్టం చేశారు.

Also Read : Charminar Ganesha : ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా చార్మినార్ గ‌ణేషా

Leave A Reply

Your Email Id will not be published!