AP CM YS Jagan : ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు తీపి కబురు
ఖుష్ కబర్ చెప్పిన ఏపీ సీఎం జగన్ రెడ్డి
AP CM YS Jagan : అమరావతి – ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి(AP CM YS Jagan) సంచలన ప్రకటన చేశారు. ఇప్పటి దాకా ప్రజలకు విశిష్ట సేవలు అందిస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్ఆర్టీసీ) ఉద్యోగులకు తీపి కబురు చెప్పారు.
AP CM YS Jagan Good News to
ఇప్పటికే ఆర్టీసీ ఉద్యోగులు తమ న్యాయ పరమైన సమస్యలు పరిష్కరించాలని కోరుతూ పలుమార్లు సీఎంను కలిసి విన్నవించారు. ఈ మేరకు ఆర్టీసీ ఉద్యోగుల డిమాండ్లకు ఓకే చెప్పారు. వచ్చే జనవరి నుంచి జీతాలతో పాటు అలవెన్సులు కలిపి చెల్లించాలని జగన్ మోహన్ రెడ్డి ఆదేశించారు.
వచ్చే జనవరి నుంచి జీతాలతో పాటు అలవెన్సులు చెల్లించేందుకు చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు సీఎం. నైట్ అవుట్, డే అవుట్, ఓవర్ టైం అలవెన్సులను ఇప్పటివరకు ఆలస్యంగా చెల్లిస్తుండగా ఇకపై జీతంతో పాటే ఇవ్వనుంది.
2017 పీఆర్సీ బకాయిలు, స్టాఫ్ రిటైర్మెంట్ బెనిఫిట్ స్కీమ్ ట్రస్ట్ కు చెల్లించాల్సిన మొత్తాన్ని కూడా దశల వారీగా చెల్లించనుంది. ప్రభుత్వ నిర్ణయంపై ఆర్టీసీ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జగన్ సర్కారు తమ సమస్యలు పరిష్కరించినందున ఉద్యోగులు ధన్యవాదాలు తెలిపారు.
ఇప్పటికే ఆర్టీసీ సిబ్బందిని ప్రభుత్వ ఉద్యోగులుగా జగన్ సర్కార్ గుర్తించిందని రానున్న రోజులు ఈ ప్రభుత్వానికి మద్దతుగా ఉంటామని ఉద్యోగ సంఘాల నేతలు స్పష్టం చేశారు.
Also Read : Komatireddy Venkat Reddy : ఢిల్లీలో కోమటిరెడ్డి హల్ చల్