AP CM YS Jagan : బాధితుల‌కు జ‌గ‌న్ భ‌రోసా

ఆర్థిక సాయం ప్ర‌క‌టించిన సీఎం

AP CM YS Jagan : విజ‌య‌న‌గ‌రం జిల్లా – ఏపీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి విజ‌య‌న‌గ‌రం జిల్లాలో ప్యాసింజ‌ర్ రైలును ఎక్స్ ప్రెస్ ట్రైన్ ఢీకొన్న ఘ‌ట‌న‌లో గాయ‌ప‌డి చికిత్స పొందుతున్న బాధితుల‌ను ప‌రామ‌ర్శించారు. వారికి మెరుగైన వైద్య చికిత్స అందించాల‌ని ఆదేశించారు. ఎవ‌రికీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాల‌ని సూచించారు. సీఎం టూర్ సంద‌ర్శంగా భారీ భ‌ద్ర‌త‌ను ఏర్పాటు చేశారు.

AP CM YS Jagan Meet Victims

నేరుగా స‌ర్వ‌జ‌న ఆస్ప‌త్రికి చేరుకున్నారు. రెండు వార్డుల్లో చికిత్స పొందుతున్న 22 మందిని స్వ‌యంగా ప‌రామ‌ర్శించారు. ప్ర‌తి బెడ్డు వ‌ద్ద‌కు వెళ్లారు. ప్ర‌మాదం జ‌రిగిన తీరును, వారికి అందిస్తున్న వైద్య స‌దుపాయాల గురించి వాక‌బు చేశారు జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి.

చిన్నారుల‌ను సైతం ప‌ల‌క‌రించారు. ప్ర‌భుత్వం మీ అంద‌రికీ అండ‌గా ఉంటుంద‌ని స్ప‌ష్టం చేశారు సీఎం. ఎవ‌రూ ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం లేద‌న్నారు. ఇదిలా ఉండ‌గా గాయ‌ప‌డిన వారు కోలుకునేంత వ‌ర‌కు వారిని ఆస్ప‌త్రుల్లోనే ఉంచాల‌ని, వారు పూర్తిగా కోలుకున్న త‌ర్వాతే ఇళ్ల‌కు పంపించాల‌ని ఉన్న‌తాధికారుల‌ను ఆదేశించారు సీఎం.

ఇదిలా ఉండ‌గా జ‌గ‌న్ రెడ్డి(AP CM YS Jagan) కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. రైలు ప్ర‌మాద‌ ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా అందించాలని, అలాగే అంగవైకల్యం పొందితే వారికీ రూ.10 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందించాల‌ని ఆదేశించారు జ‌గ‌న్ రెడ్డి.

గాయ‌ప‌డిన వారు కోలుకునేందుకు నెల‌కు పైగా స‌మ‌యం ప‌డితే వారికి రూ. 5 ల‌క్ష‌లు, నెల లోపు కోలుకుంటే రూ. 2 ల‌క్ష‌లు ఆర్థిక సహాయం అంద‌జేయాల‌న్నారు.

Also Read : Leaders Values Comment : వ‌ల‌స‌ల జాత‌ర విలువ‌ల‌కు పాత‌ర

Leave A Reply

Your Email Id will not be published!