AP CM YS Jagan : అమ‌ర‌జీవి త్యాగం చిర‌స్మ‌ర‌ణీయం

ఏపీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి

AP CM YS Jagan : తాడేప‌ల్లి గూడెం – ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్రంలో అవ‌త‌ర‌ణ దినోవ‌త్స‌వ వేడుక‌లు ఘ‌నంగా జ‌రిగాయి. తాడేప‌ల్లి గూడెంలోని క్యాంపు కార్యాల‌యంలో అవ‌త‌వ‌ర‌ణ దినోత్స‌వాల‌ను నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మంలో ఏపీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పాల్గొన్నారు.

AP CM YS Jagan in AP formation day

ఈ సంద‌ర్భంగా పోలీసుల నుంచి గౌర‌వ వంద‌నం స్వీక‌రించారు సీఎం. అనంత‌రం జాతీయ ప‌తాకాన్ని ఆవిష్క‌రించారు. అక్క‌డి నుంచి రాష్ట్రం కోసం ఆత్మార్ప‌ణం చేసుకున్న అమ‌ర‌జీవి పొట్టి శ్రీ‌రాములు విగ్ర‌హానికి పూల‌మాల‌లు వేశారు జ‌గ‌న్ రెడ్డి. ఘ‌నంగా నివాళులు అర్పించారు.

ఆంధ్రప్రదేశ్ భాషా, సాంస్కృతిక శాఖ సంచాలకులు రేగుళ్ల మల్లిఖార్జునరావు రచించిన స్వాతంత్రోద్యమంలో ఆంధ్రులు పుస్తకాన్ని ఆవిష్కరించారు జ‌గ‌న్ రెడ్డి(AP CM YS Jagan). ఈ సంద‌ర్భంగా సీఎం ప్ర‌సంగించారు.

ఏపీ అవ‌త‌ర‌ణ దినోత్స‌వంలో పాల్గొన‌డం త‌న‌కు సంతోషంగా ఉంద‌న్నారు. అమ‌ర‌జీవి పొట్టి శ్రీ‌రాములు చేసిన త్యాగం మ‌రిచి పోలేనిద‌న్నారు. ఆయ‌న చేసిన త్యాగం త‌ర త‌రాలకు స్పూర్తి దాయ‌కంగా ఉంటుంద‌ని స్ప‌ష్టం చేశారు జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి.

ఈ కార్య‌క్ర‌మంలో రాష్ట్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి ఆర్‌ కె రోజా, మహిళ, శిశు సంక్షేమశాఖ మంత్రి కె వి ఉషాశ్రీ చరణ్, సీఎస్‌ డాక్టర్‌ కె ఎస్‌ జవహర్‌ రెడ్డి, డీజీపీ కె వి రాజేంద్రనాథ్‌రెడ్డి, సాంస్కృతిక పర్యాటకశాఖ స్పెషల్‌ సీఎస్‌ రజత్‌ భార్గవ, పలువురు ఇతర ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Also Read : Daggubati Purandeswari : కేంద్రం వ‌ల్ల‌నే ఏపీ అభివృద్ది

Leave A Reply

Your Email Id will not be published!