AP CM YS Jagan : యుద్ద ప్రాతిపదికన ఇళ్ల నిర్మాణం
స్పష్టం చేసిన ఏపీ సీఎం వైఎస్ జగన్
AP CM YS Jagan : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఇళ్ల నిర్మాణం యుద్ద ప్రాతిపదికన చేపడుతున్నామని స్పష్టం చేశారు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి(Jagan Mohan ReddyJ). గుంటూరు జిల్లా కృష్ణాయపాలెంలో సోమవారం ఆంధ్ర ప్రదేశ్ గృహ నిర్మాణ శాఖ ద్వారా ఈడబ్ల్యూఎస్ లే అవుట్లలో రూ. 1,829.57 కోట్ల ఖర్చుతో మౌళిక వసతులతో చేపట్టనున్న 50 వేల 793 ఇళ్ల నిర్మాణానికి , 45 సామాజిక వసతుల ప్రాజెక్టులకు ఏపీ సీఎం శంకుస్థాపన చేశారు.
AP CM YS Jagan & Schemes
ఈ సందర్భంగా జగన్ మోహన్ రెడ్డి ప్రసంగించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఇళ్ల నిర్మాణం చేపట్టడం జరిగిందని చెప్పారు. తాము ఎక్కడా రాజీ పడడం లేదని పేర్కొన్నారు సీఎం. పేదలు, మధ్య తరగతి ప్రజల కలల్ని సాకారం చేసేందుకు తమ ప్రభుత్వం ఇళ్లను ఇస్తోందన్నారు.
సంక్షేమ పథకాలు, కార్యక్రమాలు పేదల అభ్యున్నతి కోసం ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. విద్య, వైద్యం, ఉపాధి, ఇళ్ల నిర్మాణం, పరిశ్రమల ఏర్పాటే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని స్పష్టం చేశారు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి.
ఏ ఒక్కరు ఇబ్బంది పడకుండా ఉండేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. ఇప్పటికే రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో ఇళ్ల నిర్మాణం పూర్తయిందని చెప్పారు ఏపీ సీఎం. మున్ముందు కూడా ఇళ్ల నిర్మాణం మరింత వేగవంతంగా జరుగుతుందని స్పష్టం చేశారు.
Also Read : India Protest : మణిపూర్ హింసకు మోదీదే బాధ్యత