AP CM YS Jagan : త్వరలో ఏపీలో ఐటీ స్పేస్ – జగన్
రెండున్నర లక్షల ఎకరాలలో ఏర్పాటు
AP CM YS Jagan : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. ఈ మేరకు ఏపీలో త్వరలో ఫేజ్ -2 కింద బిగ్ ఐటీ స్పేస్ రాబోతోందని వెల్లడించారు. మంగళవారం వైజాగ్ లో రూ. 600 కోట్లతో ఏర్పాటు చేయబోయే రహేజా మాల్ కు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచ వ్యాప్తంగా ఐటీ రంగానికి ప్రయారిటీ పెరుగుతోందన్నారు. త్వరలోనే ఏపీ కూడా ఇతర రాష్ట్రాలకు ధీటుగా ఐటీని విస్తరించే పనిలో పడిందన్నారు.
AP CM YS Jagan Said
తమ ప్రభుత్వం విద్యా రంగంలో కీలక మార్పులకు శ్రీకారం చుట్టామని స్పష్టం చేశారు. దీని వల్ల ఉపాధి అవకాశాలకు ఆస్కారం ఏర్పడుతుందన్నారు. మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా మనం కూడా మారాల్సిన అవసరం ఉందన్నారు. ఇతర రాష్ట్రాలకు ధీటుగా ఐటీలో ఏపీని అగ్రగామిగా నిలపాలన్నదే తన లక్ష్యమని స్పష్టం చేశారు ఏపీ సీఎం జగన్ రెడ్డి(AP CM YS Jagan).
ఏకంగా రెండున్నర లక్షల ఎకరాలను కేవలం ఐటీ స్పేస్ కోసం కేటాయించడం మామూలు విషయం కాదన్నారు. దీని వల్ల పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయని, ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం ఉండదన్నారు. విదేశాల నుంచి మన వద్దకు వచ్చేలా చేయాలని పిలుపునిచ్చారు ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.
Also Read : Peddireddy Rama Chandra Reddy : బాబుపై పెద్దిరెడ్డి ఫైర్