AP CMO: హెలికాప్టర్ వివాదంపై క్లారిటీ ఇచ్చిన సీఎంఓ అధికారులు
హెలికాప్టర్ వివాదంపై క్లారిటీ ఇచ్చిన సీఎంఓ అధికారులు
AP CMO : సీఎం చంద్రబాబు కోసం కొత్త హెలికాప్టర్‌ను కొనలేదని ముఖ్యమంత్రి కార్యాలయం (AP CMO) స్పష్టం చేసింది. పాత హెలికాప్టర్‌లో తరచూ సాంకేతిక సమస్యలు తలెత్తుతుండటంతో… అది సురక్షితం కాదన్న భద్రతా వర్గాల హెచ్చరికలతో ఎయిర్‌బస్ హెచ్-160 మోడల్ హెలికాప్టర్‌ను అద్దెకు తీసుకున్నట్లు తెలిపింది. కొత్తది కొన్నారంటూ సామాజిక మాధ్యమాల్లో కొందరు చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని సీఎంఓ కార్యాలయం ఖండించింది. అలాంటి ప్రచారాలతో ప్రభుత్వానికి చెడ్డపేరు తేవాలని కుట్రపూరితంగా వ్యవహరిస్తున్న వారిపై కేసులు పెడతామని హెచ్చరించింది. ‘బెెల్ కంపెనీకి చెందిన హెలికాప్టర్‌ను సీఎం సహా వీవీఐపీల కోసం అద్దె ప్రాతిపదికన ఇన్నాళ్లూ రాష్ట్ర ప్రభుత్వం వినియోగిస్తోంది.
AP CMO Key Update
ఇటీవల సీఎం చంద్రబాబు (CM Chandrababu), కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ పర్యటనల్లో ఈ హెలికాప్టర్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. ఇలాంటి ఇబ్బందుల నేపథ్యంలో బెల్ కంపెనీ హెలికాప్టర్‌ను క్షుణ్ణంగా పరిశీలించిన భద్రతా వర్గాలు దాని స్థానంలో మరొకటి వినియోగించాలని సూచించాయి. ఈ క్రమంలో అధునాతన హెలికాప్టర్‌ను అద్దెకు తీసుకున్నాం’ అని వివరించింది. ‘కొత్తగా అద్దెకు తీసుకున్న హెలికాప్టర్‌లో అమరావతి నుంచి నేరుగా శ్రీకాకుళం, చిత్తూరు వరకు ప్రయాణించొచ్చు. దీంతో కాన్వాయ్, విమాన ఖర్చులు తగ్గుతాయి. మొత్తం ప్రయాణ ఖర్చుల్లో 70 శాతం మేర ఆదా అవుతుంది’ అని సీఎం కార్యాలయం వెల్లడించింది.
సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్‌కు అస్వస్థత
సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్ శ్రీశైలం నుంచి వస్తుండగా అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) డైరెక్టర్ ప్రవీణ్ సూద్ శుక్రవారం హైదరాబాద్ కు వచ్చారు. ఇక్కడి నుంచి శ్రీశైలం వెళ్లి దైవదర్శనం చేసుకున్నారు. తిరుగు ప్రయాణంలో అస్వస్థతకు గురయ్యారు. స్థానిక సీబీఐ అధికారులు హైదరాబాద్‌లోని పోలీసు అకాడమీలో శనివారం ఆయన్ను కలవాల్సి ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై రాష్ట్ర ప్రభుత్వం సీబీఐ విచారణ కోరిన నేపథ్యంలో వీరి భేటీకి ప్రాధాన్యం ఏర్పడింది. కానీ ప్రవీణ్ సూద్ అస్వస్థతకు గురైన నేపథ్యంలో ఈ సమావేశంపై సందిగ్ధత నెలకొంది.
Also Read : Khairatabad Ganesh: గంగమ్మ ఒడికి ఖైరతాబాద్ మహా గణపతి
