Swachh Survekshan: స్వచ్ఛ సర్వేక్షణ్‎ 2024-25లో ఏపీకి ఐదు అవార్డులు ! 

స్వచ్ఛ సర్వేక్షణ్‎ 2024-25లో ఏపీకి ఐదు అవార్డులు ! 

Swachh Survekshan : స్వచ్ఛ సర్వేక్షణ్ 2024-25లో ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఐదు నగరాలు ప్రతిష్టాత్మక అవార్డులు సాధించాయి. జీవీఎంసీ, విజయవాడ, రాజమహేంద్రవరం, గుంటూరు, తిరుపతి మున్సిపల్‌ కార్పొరేషన్లకు అవార్డులు దక్కాయి. కార్పొరేషన్ల కమిషనర్లతో కలిసి మంత్రి నారాయణ.. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేతుల మీదుగా అవార్డులు అందుకున్నారు. కేంద్రమంత్రి మనోహర్‌లాల్‌, ఏపీ స్వచ్ఛాంద్ర కార్పొరేషన్‌ ఛైర్మన్‌ పట్టాభితో పాటు ఆయా కార్పొరేషన్ల అధికారులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పట్టుదల, ప్రణాళిక, ప్రజా సహకారంతోనే రాష్ట్రానికి ఈ గౌరవం దక్కిందని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ అన్నారు.

Swachh Survekshan 2025 Awards

కేంద్రం ప్రకటించిన స్వచ్ఛ సర్వేక్షణ్ సర్వే 2024-25లో (Swachh Survekshan) ఇండోర్ వరుసగా 8వ సారి అత్యంత పరిశుభ్రమైన నగరంగా నిలిచింది. ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా ఐదు అవార్డులు గెల్చుకుని వావ్ అనిపించింది. స్వచ్ఛ సర్వేక్షన్-2025 అవార్డుల (Swachh Survekshan) కార్యక్రమంలో ఏపీ నుంచి విజయవాడ, తిరుపతి, గుంటూరు, గ్రేటర్ విశాఖపట్నం (జీవీఎంసీ), రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్లు అవార్డులు దక్కించుకున్నాయి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఏపీ పురపాలక శాఖ మంత్రి నారాయణ అవార్డులు స్వీకరించారు.

ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి మనోహర్ లాల్‌తోపాటు రాష్ట్ర పురపాలక శాఖ అధికారులు, ఆయా కార్పొరేషన్ల అధికారులు పాల్గొన్నారు. స్వచ్ఛ సర్వేక్షన్ అవార్డులు అందుకోవడం గర్వకారణమని, ఈ విజయానికి కృషి చేసిన అధికారులు, సిబ్బందిని మంత్రి నారాయణ హృదయపూర్వకంగా అభినందించారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వచ్ఛ భారత్ మిషన్‌పై ప్రత్యేక దృష్టి సారించారని మంత్రి తెలిపారు. ఈ క్రమంలో ప్రతి నెలా మూడో శనివారం స్వచ్ఛతా కార్యక్రమాలను నిర్వహిస్తూ ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నట్లు చెప్పారు. భవిష్యత్తులో మరిన్ని అవార్డులు సాధించేందుకు ఏపీ సన్నద్ధమవుతోందని, స్వచ్ఛతా కార్యక్రమాలకు ప్రజల సహకారం, అధికారుల అంకితభావం కూడా కీలకమని మంత్రి నారాయణ వెల్లడించారు.

ఇదే సమయంలో తెలంగాణ నుంచి క్లీనెస్ట్‌ కంటోన్మెంట్ బోర్డ్ విభాగంలో సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ మొదటి స్థానాన్ని సొంతం చేసుకుంది. తెలంగాణ రాజధాని హైదరాబాద్‌ వ్యర్థాల రహిత నగరం విభాగంలో 7 స్టార్‌ రేటింగ్‌ సాధించి, గతంలో ఉన్న 5 స్టార్‌ రేటింగ్‌ను మెరుగుపరుచుకుని సత్తా చాటింది. అంతేకాదు ప్రామిసింగ్‌ స్వచ్ఛ షహర్‌ జాబితాలోనూ హైదరాబాద్‌ తన స్థానాన్ని నిలబెట్టుకుంది.

Also Read : Harish Rao: దిల్లీ భేటీ ఎజెండాలో మొదటి అంశమే బనకచర్ల ప్రాజెక్ట్ – మాజీ మంత్రి హరీశ్ రావు

Leave A Reply

Your Email Id will not be published!