AP Govt Announce : ఏపీలో 14 నుంచి ద‌స‌రా సెల‌వులు

24 వ‌ర‌కు ప్ర‌క‌టించిన రాష్ట్ర స‌ర్కార్

AP Govt Announce : అమ‌రావ‌తి – ఆంధ్ర‌ప్ర‌దేశ్(Andhra Pradesh) ప్ర‌భుత్వం కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. ఆంధ్ర ప్ర‌జ‌లు ఎక్కువ‌గా జ‌రుపుకునే పండ‌గ ద‌స‌రా. ఈ మేర‌కు పండును పుర‌స్క‌రించుకుని స‌ర్కార్ అక్టోబ‌ర్ 14 నుంచి 24 వ‌ర‌కు విద్యా సంస్థ‌ల‌కు సెల‌వులు ప్ర‌క‌టించింది.

ఇందులో భాగంగా రాష్ట్రంలో ఈ నెల 3 నుంచి 6 వరకు పాఠశాల విద్యాశాఖ ఫార్మేటివ్‌ అసెస్‌మెంట్‌ (ఎఫ్‌ఏ)–2 పరీక్షలు నిర్వహించనుంది. అన్ని యాజమాన్యాల ప్రాథమికోన్నత, ఉ­న్న­త పాఠశాలల్లో 6 నుంచి 10వ తరగతి వి­ద్యా­ర్థులకు నిర్దేశించిన సిలబస్‌ ప్రకారం పరీక్షలు నిర్వహిస్తారు.

AP Govt Announce Dussehra Holidays

ఉమ్మడి ప్రశ్నాపత్రం ఆధారంగా పాత పద్ధతిలోనే పరీక్షలు జరుగుతా­యి. ప్రశ్నాపత్రాలను పరీక్ష జరిగే రోజు మం­డల విద్యాశాఖాధికారులు, ప్రధానోపాధ్యాయులకు పంపిస్తారు. పరీక్షకు గంట ముందు ఆయా పాఠశాలల హెచ్‌ఎంలకు ప్రశ్నా పత్రాలు పంపాలని ఇప్పటికే ఎంఈవోలకు ఉన్నతా­ధికారులు ఆదేశాలు జారీ చేశారు.

9, 10 తరగతుల విద్యార్థులకు రోజుకు రెండు పరీక్షలు ఉదయం, 6, 7, 8 తరగతుల విద్యార్థులకు మద్యాహ్నం పరీక్షలు ఉంటాయి. ఒకటి నుంచి 5వ తరగతుల విద్యార్థులకు ఉదయం ఒకటి, మధ్యాహ్నం మరొక పరీక్ష నిర్వహిస్తారు. 10వ తేదీలోగా సమాధాన పత్రాలను మూల్యాంక­నం చేసి విద్యార్ధులకు అందిస్తారు.

అలాగే ఆన్‌­లై­న్‌ పోర్టల్‌లోనూ మార్కులు నమోదు చేయాలని విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 10న విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశం నిర్వహించి విద్యార్థుల ప్రగతిని తెలియ జేయాలని సూచించింది.

Also Read : Minister KTR : మోసానికి చిరునామా మోదీ – కేటీఆర్

Leave A Reply

Your Email Id will not be published!