AP Govt : విఐపీల భద్రత కై 9 కోట్లతో బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు కొన్న ఏపీ సర్కార్

రాష్ట్రంలో నిత్యం ఎక్కడో అక్కడ....

AP Govt : రాష్ట్రంలో వీఐపీల భద్రత కోసం ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అందులోభాగంగా వారి కోసం బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు కొనుగోలు చేయాలని నిర్ణయించింది. ఆ క్రమంలో 10 బుల్లెట్ ప్రూఫ్ వాహనాల కొనుగోలుకు రాష్ట్ర హోం శాఖ మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. అయితే 10 టయోటా ఫార్చునర్ వాహనాలు కొనుగోలు చేసి.. వాటిని బుల్లెట్ ప్రూఫ్‌గా మార్చాలని ఆ ఆదేశాల్లో స్పష్టం చేసింది. 10 టయోటా ఫార్యునర్ వాహనాలు కొనుగోలు చేసి.. వాటిని బుల్లెట్ ప్రూఫ్‌ ఫ్యాబ్రికేషన్ కోసం రూ. 9.20 కోట్లు కేటాయించాలని ఆ ఆదేశాల్లో పేర్కొంది. ఆంధ్రప్రదేశ్‌లోని కొందరు ముఖ్యులతోపాటు ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వీఐపీలకు రక్షణగా ఈ వాహనాలు వినియోగించాలని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది.

AP Govt Updates

రాష్ట్రంలో నిత్యం ఎక్కడో అక్కడ.. ఎప్పుడో అప్పుడు వీఐపీలు పర్యటిస్తున్నారు. అదీకాక.. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు వివిధ దేశాలకు చెందిన ప్రముఖులు రాష్ట్రానికి తరలి వస్తున్నారు. వారికి భద్రత కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అలాగే ప్రభుత్వంలోని పెద్దలు సైతం తరచు వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. వీరిని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

Also Read : 2025 ఐపీఎల్ స్టార్ట్ అవ్వకముందే మారిన గుజరాత్ టైటాన్స్ ఓనర్

Leave A Reply

Your Email Id will not be published!