AP Government: వరద బాధితుల ఖాతాల్లోకి నష్టపరిహారం సొమ్మును జమ!
వరద బాధితుల ఖాతాల్లోకి నష్టపరిహారం సొమ్మును జమ!
AP: విజయవాడ కలెక్టరేట్‌లో వరద బాధితులకు నష్ట పరిహారాన్ని అందజెసిన రాష్ట్రా ప్రభుత్వం. విజయవాడలోని 179 సచివాలయాల పరిధిలోని ప్రజలకు ప్రభుత్వం సాయం అందిస్తుంది. నేరుగా వరద బాధితుల ఖాతాల్లోకి నష్టపరిహారం సొమ్మును జమ చేశారు. ఎన్యూమరేషన్ పూర్తి కావడంతో అర్హులైన బాధితులందరికీ వారి ఖాతాల్లో పరిహారం డబ్బులు జమ కానున్నాయి.
AP Govt Credits..
రాష్ట్రంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలతో అనేక ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. వరద ఉధృతితో సర్వం కోల్పోయిన పరిస్థితి ఏర్పడింది. భారీ వరదలు విజయవాడ వాసులను అంతలాకుతలం చేశాయి. భారీ వరదల నేపథ్యంలో ప్రభుత్వ యంత్రాంగం వెంటనే అప్రమత్తమైంది. సీఎం చంద్రబాబు(CM Chandrababu)సహా ప్రతీ ఒక్కరూ వరద సహాయక చర్యల్లో పాల్గొన్నారు. అంతేకాకుండా వరద బాధితులకు సర్కార్ వరద సహాయాన్ని కూడా ప్రకటించింది.
బుధవారం నాడు సీఎం చంద్రబాబు విజయవాడ కలెక్టరేట్‌లో వరద బాధితులకు నష్ట పరిహారాన్ని అందజేశారు. విజయవాడలోని 179 సచివాలయాల పరిధిలోని ప్రజలకు ప్రభుత్వం సాయం అందిస్తుంది. నేరుగా వరద బాధితుల ఖాతాల్లోకి నష్టపరిహారం సొమ్మును జమ చేశారు. ఎన్యూమరేషన్ పూర్తి కావడంతో అర్హులైన బాధితులందరికీ వారి ఖాతాల్లో పరిహారం డబ్బులు జమ కానున్నాయి. వరదలతో నష్టపోయిన వాహనాలకు బీమా చెల్లింపులు కూడా ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
Also Read : Minister Muthuswamy : తమిళ రాష్ట్రంలో విడతల వారీగా మద్యం దుకాణాల మూసివేతకు చర్యలు