YS Jagan : ముంపు బాధితులకు జగన్ అండ
తక్షణ సాయం అందించాలని ఆదేశం
YS Jagan : ఏపీలో పెద్ద ఎత్తున వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే పలు జిల్లాలు నీట మునిగాయి. పునరావాస చర్యలలో ఎలాంటి జాప్యం ఉండ కూడదని ఏపీ సీఎం సందింటి జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు.
ఈ మేరకు వెంటనే ప్రభుత్వం అందించే సాయం అందించాలని ఆదేశించారు. ఆయా జిల్లాల కలెక్టర్లు, పర్యవేక్షణ అధికారులు దగ్గరుండి పనులు చచూడాలని సూచించారు. ఇక వరద బాధిత కుటుంబాలకు రూ. 2 వేలు, రేషన్ సరుకులు అందించాలన్నారు.
ఒక వేళ ముంపు బాధితులు వచ్చినా, రాకున్నా సాయం ఇవ్వాలన్నారు సీఎం. గోదావరి వరదలపై జగన్ సమీక్షించారు. మానవతా దృక్ఫథంతో వ్యవహరించాలని ఏ ఒక్కరికీ ఇబ్బంది లేకుండా చూడాలని స్పష్టం చేశారు.
వరద తగ్గగానే 10 రోజుల్లో పంట , ఆస్తి నష్టం అంచనాలు రూపొందించాలన్నారు. వైద్య బృందాలు మరింత సేవల్లో నిమగ్నం కావాలన్నారు. ముంపు బాధితులకు ఎలాంటి సహాయం కావాలన్నా ప్రభుత్వం అందించేందుకు సిద్దంగా ఉందన్నారు సీఎం.
ఎవరికైనా ఇబ్బంది ఉన్నా వెంటనే ఫోన్ కాల్ చేస్తే వెంటనే బాధితుల వద్దకు సాయం అందించేలా ఏర్పాటు చేశామని చెప్పారు.
దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీలో అమలవుతున్న సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామన్నారు. రాష్ట్ర ప్రతిష్టను దిగజార్చేందుకు టీడీపీ యత్నిస్తోందంటూ మండిపడ్డారు జగన్ రెడ్డి(YS Jagan).
25 కిలోల బియ్యం, కిలో కందిపప్పు, కిలో బంగాల దుంపలు, కిలో ఉల్లి పాయలు, కిలో పామాయిల్ తో రేషన్ సరుకులు పంపిణీ చేయాలని జగన్ రెడ్డి ఆదేశించారు.
Also Read : వరద బాధితులకు జగన్ ఆసరా రూ.2 వేలు సాయం